ఒమన్ పర్యటనలో ప్రధాని మోడీ చెవికి కొత్తగా ఏమిటిది..!
ఒమన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడి.. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక ముదడుగు వేశారు.;
ఒమన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడి.. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక ముదడుగు వేశారు. ఈ సందర్భంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా.. ఇరు దేశాల వృద్ధికి ఇది అనేక అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యలో మోడి చెవికి కనిపించిన ఓ వస్తువు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అవును... భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాని సమక్షంలో సంప్రదాయ నృత్యం, గార్డ్ ఆఫ్ హానర్ తో సహా గొప్ప వైభవంతో మోడీకి స్వాగతం పలికారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయ సోషల్ మీడియాలో ఉత్సుకతను రేకెత్తించింది. అదే.. మోడి తన కుడి చెవిపై ధరించిన వస్తువు. పైగా అది మెరుస్తుంది.
దీంతో.. మోడీ చెవిపోగు ధరించారా అనే ఊహాగాణాల వరద మొదలైంది. ఇది మోడీ కొత్త స్టైల్లో భాగమా అనే ప్రశ్నలు దర్శనమిచ్చాయి. వాస్తవానికి... ప్రధానమంత్రిగా మోడీ నిత్యం బిజీగా ఉంటూ, దేశ వ్యవహారాలతో అవిరామంగా ఉన్నప్పటికీ ఆయన తన వార్డ్ బోర్డుపై గణనీయమైన శ్రద్ధ చూపిస్తారని అంటుంటారు. దీనిపై అభిమానుల ప్రశంసలు, ప్రత్యర్థుల విమర్శలు కూడా వినిపిస్తుంటాయి.
ఆ ప్రశంసలు, విమర్శలకు తగ్గట్లుగానే అన్నట్లుగా వీలైనంత వరకూ కలర్ ఫుల్ డ్రెస్సులలో కనిపిస్తుంటారు మోడీ! ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా మోడీ చెవికి ఒక పోగు వంటి వస్తువు వేలాడుతున్నట్లు కనిపించింది. దీంతో.. కొత్త ట్రెండా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే... కాస్త నిశితంగా పరిశీలిస్తే అది చెవిపోగు కాదని.. అది రియల్ టైమ్ ట్రాన్లేటర్ అని తేలింది.
ఉన్నత స్థాయి దౌత్య కార్యాక్రమాలకు ఇది ఉపయోగపడుతుందని, కమ్యునికేషన్ సజావుగా సాగేందుకు ఇది సహకరిస్తుందని అంటున్నారు. ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ సయీద్ ను విమానాశ్రయంలో కలిసినప్పుడు ప్రధాని మోడీ ఆ పరికరాన్ని ధరించారు. కాగా.. ఒమన్ అధికారిక భాష అరబిక్.