• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ ‘పెద్ద’లీడర్ పై...

వైసీపీ ‘పెద్ద’లీడర్ పై అటవీ శాఖ కేసు? చర్యలపై టెన్షన్.. టెన్షన్..

| ఏపీ ప్రభుత్వం మరో వైసీపీ నేతను టార్గెట్ చేసింది. వైసీపీ టాప్ లీడర్లలో ఒకరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీశాఖ కేసు ఫైల్ చేసింది

By - Tupaki Desk
Update: 2025-05-15 06:22 GMT

ఏపీ ప్రభుత్వం మరో వైసీపీ నేతను టార్గెట్ చేసింది. వైసీపీ టాప్ లీడర్లలో ఒకరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అటవీశాఖ కేసు ఫైల్ చేసింది. 11 నెలలుగా పలువురు వైసీపీ నేతలపై పోలీసు కేసులు నమోదు చేసి అరెస్టులు చేయిస్తున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగించేలా అనేక ప్రయత్నాలు చేసింది. అధికారంలోకి వచ్చిన నుంచి ఆయనను ఏ కేసుల్లో ఇరికిద్దామనే ప్రయత్నాలు చేసినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ నేరం కింద అటవీశాఖ చార్జెస్ నమోదు చేసింది.

ప్రస్తుతం పుంగునూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై ఈ నెల 6న అటవీశాఖ అధికారులుకేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి స్థలాన్ని కబ్జా చేయడంతోపాటు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించారని పెద్దిరెడ్డిపై అభియోగాలు మోపారు. అటవీశాఖ నమోదు చేసిన ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఈయన భార్య ఇందిరమ్మను నిందితులుగా చేర్చారు. అటవీ భూములను ఆక్రమించుకున్నారని పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వం ముగ్గురు అధికారులతో కమిటీ వేసింది.

ఈ కమిటీలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయి ఉన్నారు. ఈ ముగ్గురు అధికారుల విచారణలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని వెల్లడైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏ అనుమతులు లేకుండా బోరు తవ్వడంతోపాటు నిర్మాణాలు చేపట్టారని జీవ వైవిధ్యానికి భంగం కలిగించారని అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆ నివేదికలో పేర్కొంది.

పెద్దిరెడ్డి ఆక్రమిత స్థలంలో ప్రస్తుతం అటవీ అధికారులు సర్వే హద్దు రాళ్లు పాతుతున్నారు. మరో వారంలో ఇది పూర్తి కానుంది. ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డితోపాటు మిగతా నిందితులపై త్వరలో పాకాల కోర్టులో చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో అటవీ భూముల ఆక్రమణలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డికి సహకరించిన అధికారులపైనా ప్రభుత్వం ఆరా తీస్తోందని అంటున్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించారని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    
  • PeddireddyCase 
  • ForestEncroachment 
  • APPolitics 
  • MithunReddy 
  • PawanKalyan 
  • Peddireddy 
  • YSRCP 
  • ForestEncroachmentCase 
  • Chandrababu 
  • Jagan 

Similar News

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

Copyright @2026

Powered by Blink CMS