• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  చీపురుపల్లి టీడీపీలో...

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

| చీపురుపల్లిలో స్థానిక ఎన్నికల ఫలితాలు టీడీపీకి సవాల్‌గా మారాయి. గరివిడి, గుర్ల మండలాల్లో వైసీపీ జడ్పీటీసీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు, ఎంపీటీసీ స్థానాల్లోనూ ప్రభావం చూపింది. మరోవైపు బొత్స సత్యనారాయణ వ్యూహాలతో వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుండగా, ఎమ్మెల్యే కళా వెంకటరావుకు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం సవాల్‌గా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2026-11-12 06:05 GMT

విజయనగరం జిల్లాలో అత్యంత కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలోని రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ బలపడుతున్న సంకేతాలు అధికార టీడీపీని ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి దీటుగా విపక్షం మెరుగైన ఫలితాలు సాధించడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల విపక్షానిదే పైచేయి అన్నట్లు సాగుతున్న ప్రచారం టీడీపీ నేతలను ఒత్తిడికి లోనవుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో 96 శాతం మేర విజయాలు నమోదు చేసిన టీడీపీ చీపురుపల్లి నియోజకవర్గంలో మాత్రం ఆ స్థాయిలో రాణించలేక పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణాలు ఏంటన్న విషయమై అధిష్టానం కూడా ఆరా తీస్తుందన్న సమాచారం పార్టీ నేతలను టెన్షన్ కు గురిచేస్తోందని చెబుతున్నారు.

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కళా వెంకటరావు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా చీపురుపల్లి టికెట్ దక్కించుకున్న ఆయన తన ప్రత్యర్థి, సీనియర్ బొత్సను సుమారు 11 వేల ఓట్ల తేడాతో ఓడించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో స్థిరపడాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. ఈ ఆలోచనతోనే స్థానిక ఎన్నికల్లో గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కోడలు కిమిడి సంధ్యను పోటీకి పెట్టారు. అయితే ఆమె ఓడిపోవడమే కాకుండా, ఆ మండలంలో మెజార్టీ ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ పరాజయమే మూటగట్టుకుంది. అంతేకాకుండా నియోజకవర్గంలోని మరో కీలక మండలమైన గుర్ల జడ్పీటీసీ స్థానాన్ని కోల్పోయింది. ఎంపీటీసీ స్థానాల్లో కూడా వైసీపీ సగం గెలుచుకుంది. ఊహకు అందని ఈ పరాజయాలు అధికార పార్టీని ఆలోచనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రెండు మండలాల్లో ప్రభావం చూసిన వైసీపీ.. మిగిలిన రెండు మండలాల్లోనూ గట్టిపోటీనివ్వడం అధికార పార్టీని ఒత్తిడికి గురిచేస్తోంది. ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల బలమైన అభ్యర్థులు లేరన్న ప్రచారం టీడీపీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. ప్రధానంగా నియోజకవర్గంలోని రెండు మేజర్ పంచాయతీలు ఉండగా, రెండు చోట్ల బలమైన అభ్యర్థులు లేరని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తొలి నుంచి పార్టీని ఈ సమస్య వెంటాడుతోందని, సీనియర్ నేత కళా గెలిచిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు తీసుకురాలేక పోయారని అంటున్నారు. దిగువస్థాయి నేతల కారణంగా కొత్తవారు పార్టీలోకి రావడం లేదని, ఉన్నవారు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడంలో విఫలమవుతున్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే చీపురుపల్లి మండలంలో అత్తెసరు మెజార్టీతో జడ్పీటీసీ అభ్యర్థి గట్టెక్కారని, గరివిడి జడ్పీటీసీగా ఎమ్మెల్యే కోడలిని గెలిపించుకోలేక పోయారని అంటున్నారు.

బొత్స స్పీడు

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడిన సీనియర్ నేత బొత్స స్థానిక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పావులు కదిపి సక్సెస్ అయ్యారని అంటున్నారు. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా, రెండు మండలాల్లో సొంత కుటుంబ సభ్యులను జడ్పీటీసీలుగా గెలిపించుకుని అధికార పార్టీపై పైచేయి సాధించారని అంటున్నారు. అదేవిధంగా ఒక మండలంలో వైసీపీ జెండా ఎగురవేయడమే కాకుండా, మరో మండలంలో సగం స్థానాలు దక్కించుకుని మండలాధ్యక్ష పీఠంపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిస్తేజంగా మారిపోయిన వైసీపీలో ఈ ఫలితాలు కొత్త జోష్ నింపాయి. దీంతో పంచాయతీ ఎన్నికలకు దూకుడుగా అడుగులు వేస్తోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవ్వాలంటే స్థానిక సమరంలో పైచేయి సాధించాలనే ఉద్దేశంతో బొత్స వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా ఖర్చుకు వెనకాడకుండా పార్టీ అభ్యర్థులకు భరోసాగా నిలుస్తుండటంతో వైసీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితి అధికార పార్టీలో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి సీనియర్ నేత బొత్స రాజకీయ చాణక్యం ఫలించడంతో అధికార టీడీపీకి ఇక్కట్లు తప్పడం లేదన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది.

Tags:    
  • botsasatyanarayana 
  • kalavenkatarao 
  • cheepurupalli 
  • ysrcp 
  • tdp 

Similar News

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

సీఐఐ సమ్మిట్‌లో సీఎం వ్యాఖ్యలపై రచ్చ.. అమెరికా-భారత్ స్పేస్ డీల్ బయటపెట్టిన ప్రభుత్వం

2026-11-13 08:35 GMT

కూటమిపై చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు.. స్థానికంలో వైసీపీ గెలుపుపై సీఎం కీలక వ్యాఖ్యలు!

2026-11-13 06:51 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

Copyright @2026

Powered by Blink CMS