• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  చంద్రబాబు హిట్ లిస్టులో...

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

| స్థానిక ఎన్నికల్లో ఎదురైన పరాజయాలపై టీడీపీ అధిష్టానం సమీక్ష చేపట్టింది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక, కూటమి సమన్వయం, నేతల నిర్లక్ష్యమే ఓటములకు కారణమని నివేదికలు వచ్చినట్లు సమాచారం. ఇద్దరు మంత్రులను తప్పించే అవకాశాలపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2026-11-12 10:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలపై అధికార తెలుగు దేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా దృష్టి సారించింది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు, వివిధ జిల్లాలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ శ్రేణుల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా పొత్తు ధర్మాన్ని పాటించకపోవడం, స్థానిక నేతలతో సమన్వయం లోపించడం వల్లే ఆయా స్థానాల్లో పరాజయం ఎదురైందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ ఓటములకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లో ఓటమిని అధిష్టానం సహించలేకపోతోందని, ఈ కారణంతో వారిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లో ఓటమి ఎదురవడంపై పార్టీ అధిష్టానం ఉలికిపాటుకు గురైనట్లు చెబుతున్నారు. మంత్రులుగా ఉంటూ తమ నియోజకవర్గాల్లో ఓటమికి ఏం సమాధానం చెబుతారని అధిష్టానం నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతలను సమన్వయం చేసుకోవడంలో మంత్రులు విఫలమయ్యారని, ఇక జిల్లా పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకువెళతారని అధిష్టానం ప్రశ్నిస్తోందని చెబుతున్నారు. ఒక మంత్రి స్థానిక వైసీపీ నేతతో చేతులు కలపారన్న ఫిర్యాదులు రావడంతో అధిష్టానం ప్రత్యేక నివేదికలు తెప్పించుకుంటోందని అంటున్నారు. అంతేకాకుండా ఆ జిల్లాలో వైసీపీ ఏకంగా 5 జడ్పీటీసీలు, 101 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడాన్ని పార్టీ పెద్దలు సహించలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరో మంత్రి వ్యక్తిగత పట్టింపులతో కూటమి అభ్యర్థిని దాదాపు ఓటమి అంచుల దాకా తీసుకెళ్లారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఇద్దరి వ్యవహారశైలిపై అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.

మరోవైపు టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం మేయర్ స్థానాన్ని కూటమి కోల్పోవడానికి స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే సరైన శ్రద్ధ పెట్టకపోవడంతో స్వల్ప తేడాతో మేయర్ స్థానం చేజారిపోయిందని కూటమి అగ్రనేతలు భావిస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరం, పామర్రు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కారణంగా గన్నవరం, మొవ్వ జడ్పీటీసీ స్థానాల్లో ఓటమి ఎదురైనట్లు ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమలలో క్యాడర్ అభిప్రాయాలకు వ్యతిరేకంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని, ఫలితంగా నార్పల, శింగనమల జడ్పీటీసీలతో పాటు మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను వైసీపీ దక్కించుకుందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపైనా అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టిందని అంటున్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలపై ఉన్న ప్రజా వ్యతిరేకత వల్ల పార్టీ గెలవాల్సిన చోట ఓటమి ఎదురైందని రిపోర్టులు వచ్చాయని అంటున్నారు. తిరుపతి, చంద్రగిరి, గంగాధర నెల్లూరు ప్రాంతాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేల వైఖరి వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని టీడీపీ పెద్దలు గుర్తించారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎదురైన ఈ ఎదురుదెబ్బలపై మంత్రి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి ప్రాంతీయ సమన్వయకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఓటములకు అసలు కారణాలను నాలుగు నిర్దిష్ట కోణాల్లో విశ్లేషించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. క్యాడర్ మనోభావాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల నష్టపోయిన స్థానాలు, ఎమ్మెల్యేలు, నాయకుల వ్యక్తిగత నిర్లక్ష్యం కారణంగా ఓడిపోయిన నియోజకవర్గాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం వల్ల కోల్పోయిన సీట్లు, అలాగే వైసీపీ సంస్థాగతంగా బలంగా ఉండి గెలుచుకున్న స్థానాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు.

ఈ నెల 1న నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షం వైసీపీ అనంతపురం కార్పొరేషన్ తోపాటు నందికొట్కూరు, బేతంచర్ల, నాయుడుపేట మున్సిపాలిటీలను గెలచుకుంది. అదేవిధంగా 5న జరిగిన పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 74 జడ్పీటీసీ స్థానాలను 1711 ఎంపీటీసీ స్థానాల్లో పాగా వేసింది. ఈ సంఖ్య అధికార కూటమి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంపై ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ సోదిలోనే లేదని కూటమి నేతలు భావించారు. కనీసం ప్రతిఘటన కూడా ఉండదని ఊహించారని అంటున్నారు. కానీ, ఊహకు అందని విధంగా వైసీపీ పుంజుకుందని ఓటింగ్ సరళిని చూసి అభిప్రాయపడుతున్నారు.

చాలా నియోజకవర్గాల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ ఇవ్వడం, మరికొన్నిచోట్ల స్వల్ప తేడాతోనే ఓడిపోవడం ప్రమాద సంకేతంగా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. ముందు జాగ్రత్త లేకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడాల్సివస్తుందన్న ఆలోచనతో నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎన్నివచ్చాయి? తేడా ఎంత ఉందన్న అంశంపై దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు మంత్రులను తప్పించడంతోపాటు మంచి ఫలితాలు సాధించిన వారికి కొత్తగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిరాశజనంగా ఉన్న ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చోట ప్రత్యామ్నాయాలు సిద్ధం చేయాలన్న ఆలోచనకు వస్తున్నారని అంటున్నారు.

Tags:    
  • chandrababu 
  • naralokesh 
  • tdp 
  • ysrcp 
  • andhrapradeshpolitics 

Similar News

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

Copyright @2026

Powered by Blink CMS