పెద్దిరెడ్డి పిలుపు పనిచేయలేదా ..!
కానీ, అనుకున్నట్టుగా అయితే.. పెద్దిరెడ్డి వ్యూహాలు ఫలించలేదు. రెడ్డి సామాజిక వర్గంలో పెద్దగా కదలిక రాలేదు.;
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అంతర్మథనం చెందుతున్నారు. తన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టయి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. వైసీపీ హ యాంలో జరిగిన మద్యంకుంభకోణంలో కీలక పాత్ర పోషించారన్న అభియోగాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అపంతనం.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు మిథున్ రెడ్డిని తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. ఆగస్టు 1వ తేదీ వరకు కూడా జైల్లోనే ఉండాల్సి ఉంది.
అయితే.. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నది పెద్ది రెడ్డి వ్యూహం. ఇంత సీనియార్టీ ఉండి.. ఇంత అనుభవం.. అనుచరులు ఉండి కూడా.. తన కుమారుడిని జైలుకు వెళ్లకుండా అడ్డుకోలేక పోయా నన్న ఆవేదన అయితే.. పెద్దిరెడ్డిలో ఉంది. దీంతో ఆయన రెడ్డి సామాజిక వర్గంతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించారు. గురువారం, శుక్రవారాల్లో పెద్దిరెడ్డి ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. వైసీపీలోని రెడ్డి నా యకులు సహా.. సామాజిక వర్గం పరంగా కూడా.. వారి మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు.
కానీ, అనుకున్నట్టుగా అయితే.. పెద్దిరెడ్డి వ్యూహాలు ఫలించలేదు. రెడ్డి సామాజిక వర్గంలో పెద్దగా కదలిక రాలేదు. లోలోన సానుభూతి వ్యక్తం చేస్తున్నా.. బాహాటంగా మాత్రం రెడ్డి వర్గం పెద్దిరెడ్డి వర్గానికి మద్దతు ఇచ్చేందుకు ఆయన వెంట నడిచేందుకు కూడా.. ముందుకు రాలేదు. దీనికి రెండు కారణాలు ఉన్నాయ ని ఆ వర్గంలోనే చర్చ సాగుతోంది.
1) ఇప్పుడు వ్యాపారాలు అంతో ఇంతో పుంజుకునే దశలో ఉన్నాయని.. ఈ సమయంలో సర్కారుతో విభేదం పెట్టుకునేలా వ్యవహరించడం సరికాదని వారు భావిస్తున్నారు.
2) వైసీపీకి మద్దతు ఇచ్చినా.. ఆ పార్టీ తమకుఅధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదన్న ఆవేదన వారిలో ఉంది. దీంతో ఇప్పుడు మద్దతు ఇచ్చినా.. మళ్లీ అధికారంలోకి వచ్చినా.. తమకు జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని.. పైగా నాలుగేళ్ల తర్వాత.. ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఇప్పుడే చెప్పలేని ఒక సందిగ్ధత కూడా వారిని వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలా జరిగినా.. బాహాటంగా మాత్రం మద్దతు ప్రకటించే అవకాశం లేదని రెడ్డి సామాజిక వర్గం.. వైసీపీ నాయకులకు చెబుతున్నారు.దీంతో పెద్దిరెడ్డి వేసిన ఎత్తులు పారలేదని తెలుస్తోంది.