• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పిఠాపురంలో పవన్ కు మరో...

పిఠాపురంలో పవన్ కు మరో పెద్ద సమస్య సిద్ధం!

| గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో ఓటమిపాలైన పవన్ కల్యాణ్... ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ఫిక్సయిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-04-13 08:40 GMT

గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో ఓటమిపాలైన పవన్ కల్యాణ్... ఈ సారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ఫిక్సయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే అక్కడ నాలుగు రోజుల ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన జనసేనాని.. స్థానికంగా నివాసం ఉండేలా ఒక అద్దె ఇంటిని కూడా ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ క్యాంపెయినర్స్ ని కూడా రంగంలోకి దించారు!

ఇదే సమయంలో... తన గెలుపు బాధయ్తను పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ చేతుల్లో పెడుతున్నట్లు తెలిపారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఎలాగైనా ఓడించి తీరాలని వైసీపీ కంకణం కట్టుకుందని అంటున్నారు. ఇప్పటికే వంగా గీత ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుంటే... మరోవైపు ముద్రగడ పద్మనాభం రూపంలోనూ గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెబుతున్నారు.

అదేవిధంగా... ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్ ఛార్జ్ మిథున్ రెడ్డి సైతం పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించారని.. రానున్న ఎన్నికల్లో పవన్ కు గట్టి షాకిచ్చేలా పథకాలు రచిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... జగన్ కూడా పిఠాపురంలో ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేయనున్నారని తెలుస్తుంది! ఇవి చాలవన్నట్లు తాజాగా మరో సమస్య పిఠాపురంలో జనసేనానికి సిద్ధమైందని అంటున్నారు.

అవును... పిఠాపురంలో పవన్ కల్యాణ్ ని ఎలాగైనా ఓడించి తీరాలని అధికార పార్టీ అన్ని రకాల వ్యూహాలూ అమలుపరుస్తున్నారని చెబుతున్న నేపథ్యంలో... పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తలనొప్పిగా మారబోతుందనే చర్చ తెరపైకి వచ్చింది. అందుకు ప్రధాన కారణం... నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ అవ్వడమే అని అంటున్నారు.

పిఠాపురంలో అనూహ్యపరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగబోతోందని తెలుస్తుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి పేరు కే. పవన్ కల్యాణ్ అని అంటున్న నేపథ్యంలో... ఆ పార్టీ ఎన్నికల గుర్తు బకేట్ కావడం.. ఆ సింబల్ గాజు గ్లాసు గుర్తుకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుండటం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతోంది.

దీంతో... ఈ ఎన్నికలు రాజకీయంగా పవన్ కు జీవన్మరణ సమస్య అని చెబుతున్న వేళ... బకెట్ గుర్తుకు తోడు కొణిదెల పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇంటి పేరు ‘కె’ అక్షరం వచ్చే పవన్ కళ్యాణ్ ను ఎన్నికల బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు నడుస్తున్నట్లు తెలుస్తుండటం ఇప్పుడు తీవ్ర ఆసక్తిగా మారింది. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ పిఠాపురంలో గట్టెక్కుతారా.. లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags:    
  • Pawankalyan 
  • Pithapuram 
  • Janasena 
  • APelections 
  • Glasssymbol 
  • Navarangnationalcongressparty 
  • Bucketsymbol 
  • Kpawankalyan 
  • Ysrcp 
  • Jagan 
  • Tdp 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS