• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరో కీలక పదవిపై కన్నేసిన...

మరో కీలక పదవిపై కన్నేసిన జనసేన?... పవన్ వ్యాఖ్యలు వైరల్!

| ఈ క్రమంలో స్పందించిన పవన్... డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీ తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-23 05:04 GMT

ఏపీలో నూతన ప్రభుత్వం అసెంబ్లీ కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

మరోపక్క ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి, ఏ పార్టీకి దక్కనుందనేది ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఈ పదవి టీడీపీనే ఉంచుకునే అవకాశాలున్నాయనే కామెంట్లూ వినిపిస్తుంది. ఇందులో భాగంగా.. మంత్రి పదవులు దక్కని పలువురు సీనియర్లను తృప్తిపరిచే క్రమంలో భాగంగా ఈ పదవి తమవద్దే ఉంచుకునేలా బాబు భావిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పలువురు సీనియర్ల పేర్లూ తెరపైకి వస్తున్నాయి.

మరోపక్క ఈ పదవి కోసం అటు బీజేపీ, ఇటు జనసేనలు కూడా పోటీ పడుతున్నాయని.. అంటున్నారు. ఇప్పటికే బీజేపీ మరో మంత్రి పదవి ఆశిస్తుందని.. ఆ పదవి దక్కని పక్షంలో డిప్యూటీ సీఎం అయినా ఇవ్వాలని పట్టుబడుతుందని అంటున్నారు. ఇదే సమయంలో... జనసేన కూడా ఈ పదవిని ఆశిస్తుందనే చర్చ గతకొంతకాలంగా నడుస్తుంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారు.

అవును... ఏపీ అసెంబ్లీలో స్పీకర్ పదవి ఏకగ్రీవం అవ్వడం, అందుకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్న ఎంపికవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పోస్టుపై జనసేన కన్నేసిందని అంటున్నారు. ఫలితంగా సభాపతుల విషయంలో సమాన అవకాశాలు తీసుకున్నట్లు ఉంటుందని పవన్ & కో భావిస్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో స్పందించిన పవన్... డిప్యూటీ స్పీకర్ పదవి జనసేన పార్టీ తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇదే సమయంలో అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని కూడా తమ పార్టీనే తీసుకునే అవకాశం ఉందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎదుర్కొనే న్యాయపరమైన అంశాల్లో ఈ పదవి ఎంత కీలకం అనేది తెలిసిన విషయమే!

ఇక, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా చట్టాల రూపకల్పన విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని అంశాలపైనా లోతుగా సభలో విశ్లేషణలు చేస్తామని పవన్ తెలిపారు. ఈ క్రమంలోనే... అటు డిప్యూటీ స్పీకర్, ఇటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులపై స్పందించారు.

Tags:    
  • Andhrapradesh 
  • Janasenaparty 
  • Pawankalyan 
  • Assembly 
  • Deputyspeaker 
  • Ayyanapatrudu 
  • Government 
  • Politicalnews 

Similar News

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

2026-11-11 03:54 GMT

జగన్ గ్రౌండ్ లోకి దిగాల్సిందే...లేకపోతే కష్టమేనట !

2026-11-11 03:52 GMT

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS