కాళ్ళు మొక్కాను...సీఎం సీటు ఇస్తావా మోడీజీ... పవన్ !

అటువంటి పవన్ కళ్యాణ్ ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం ఆశలకు ప్రతినిధిగా ఉన్నారు.

Update: 2024-05-07 10:43 GMT

పవన్ కళ్యాణ్ ఒక్ రాజకీయ పార్టీకి చెందిన అధినాయకుడు. అంతకు మించి ఆయన సినీ రంగంలో టాప్ హీరో. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆయనకు 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే దాదాపుగా ఆరు శాతం ఓటు షేర్ వచ్చింది. అటువంటి పవన్ కళ్యాణ్ ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం ఆశలకు ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు రాజకీయ ఆశలు కూడా ఉన్నాయి.

అయితే ఆయన టీడీపీతో బీజేపీతో పొత్తులకు దిగి ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు వ్యూహాలు చాలా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ ఒక ఎమోషనల్ పర్సనాలిటీ అని చెబుతారు. ఆయనకు కోపం వచ్చినా లేక ప్రేమ కలిగినా వాటిని వెంటనే ప్రదర్శించేస్తారు అని అంటారు.

తాజాగా ఆయన రాజమండ్రిలో జరిగిన సభలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కాళ్ళకు మొక్కి ఆయనకే షాక్ ఇచ్చేశారు. ఇలా చేయకూడదు అని మోడీ సున్నితంగా పవన్ ని మందలించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అసలు మోడీకి పవన్ ఎందుకు మొక్కారు అన్నది తీసుకుంటే ఆయనలో ప్రేమాభిమానాలు మోడీ మీద నిండుగా ఉన్నాయని చెబుతారు. అదే సమయంలో ఆయన ఇంతకు ముందు మోడీకి తప్ప ఎవరికీ మొక్కలేదా అంటే 2019 ఎన్నికల వేళ ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతికి మొక్కారు.

Read more!

అపుడు కూడా అది సెన్సేషన్ అయింది. దాని కంటే ముందు ఆయన మోడీ అభిమానిని అని చెప్పుకుని 2014లో బీజేపీకి ఎన్నికలో సపోర్ట్ చేశారు. ఆ తరువాత బీజేపీతో విభేదించారు. అలా మాయావతికి మొక్కారు. దీంతోనే పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడడం మొక్కడం మీద సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కామెంట్స్ కూడా పడుతున్నాయి.

మోడీకి పవన్ కాళ్ళు మొక్కడాన్ని పాజిటివ్ గా నెగిటివ్ గా కూడా తీసుకోవచ్చు అంటున్నారు. వయసులో అనుభవంలో పదవిలో పెద్ద వారు కాబట్టి మోడీకి పవన్ కాళ్ళు మొక్కారు అని అనుకోవచ్చు. అయితే సోషల్ మీడియా యుగంలో వీటిని అసలు ఒప్పుకోదు. పవన్ కాళ్ళ మొక్కుడు మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చి పడుతున్నాయి.

ఈ కాళ్ళ మొక్కుడు వెనక అనేక అర్ధాలు ఉన్నాయని రాజకీయ పరమార్ధాలు కూడా ఉన్నాయని సాగదీసి మరీ భాష్యం చెబుతున్న వారు సోషల్ మీడియాలో ఎక్కువ అయ్యారు. అదెలా అంటే ఏపీలో రేపటి రోజున టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా సోలోగా టీడీపీకి మెజారిటీ రాకపోతే అంటే 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దక్కకపోతే అపుడు జనసేనకు వచ్చే సీట్లు బిగ్ నంబర్ అవుతుంది.

అలా కింగ్ మేకర్ అవతారం పవన్ కళ్యాణ్ ఎత్తే వీలు ఉంటుంది. అపుడు కూటమిలో పెద్దన్నగా ఉన్న బీజేపీ కేంద్ర అధినాయకత్వం కరుణ దయ తన మీద ఉంటే సీఎం పోస్ట్ తనకు దక్కే వీలుంటుందని అందుకే పవన్ ముందుగానే మోడీని ప్రసన్నం చేసుకుంటున్నారు అని కామెంట్స్ పడుతున్నాయి.

4

దీంతోనే పవన్ కళ్యాణ్ మోడీని కాకా పడుతున్నారు అని అంటున్నారు. అయితే నరేంద్ర మోడీ ఈ కాకాలకు పడే రకమా అంటే కాదు అనే చెబుతారు. ఆయన స్థిరమైన దృఢమైన నాయకుడు. ఆయన రాజకీయాలో గట్టి పిండం. ఎన్నో చూసి వచ్చారు. ఒకవేళ అలాంటి సన్నివేశమే వస్తే కనుక బీజేపీనే ముందుకు తోసి ఆ పార్టీ ప్రతినిధినే సీఎం సీట్లో కూర్చోబెడతారు తప్ప వేరే వారికి ఎందుకు చాన్స్ ఇస్తారు అన్న ప్రశ్న వస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీలో చూస్తే టీడీపీ కూటమిలో టీడీపీ పెద్ద పార్టీ. ఆ పార్టీకి సీట్లు కొన్ని మ్యాజిక్ ఫిగర్ కి తగ్గితే ఏదో విధంగా భర్తీ చేసుకుని అధికారంలోకి వచ్చే కెపాసిటీ ఉన్న గండర గండడు చంద్రబాబు ఉన్నారని కూడా అంటారు. బాబు పార్టీకి చెందిన వారే సగానికి పైగా అటు బీజేపీ ఇటు జనసేనల నుంచి పోటీ చేస్తున్న సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు.

మొత్తం మీద చూస్తే కనుక పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంతోనే ఇలా కాళ్ళు మోడీకి మొక్కి ఉంటారా అన్నది మాత్రం సెటైరికల్ గా వైరల్ చేస్తున్నారు. ఏపీలో హంగ్ కనుక వస్తే బీజేపీ అసలైన రాజకీయం కూడా అంతా చూస్తారని కూడా చర్చకు వస్తున్న విషయం. అంటే వైసీపీ నుంచి కూడా కీలక ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని ఏపీలో బీజేపీ ప్రభుత్వమే స్థాపన జరిగేలా చూసుకుంటుంది అన్నది కూడా వినిపించే మాట. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కాళ్ళ మొక్కుడు సెంటిమెంట్ 2019లో మాయవతి విషయంలోనూ పని చేయలేదు, ఇపుడు మాత్రం ఎలా పనిచేస్తుందని యాంటీ సెంటిమెంట్ ని ముందుకు తెస్తున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News