• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ కి డాక్టరేట్... బిగ్...

పవన్ కి డాక్టరేట్... బిగ్ ట్విస్ట్ ఏమిటంటే...!?

| పవన్ కళ్యాణ్ ఈ మేరకు యూనివర్శిటీ పెద్దలకు లేఖ రాస్తూ తన కంటే సమాజానికి సేవ చేసిన వారు చాలా మంది ఉన్నారని వారిని గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేయాలని కోరారు.

By - Tupaki Desk
Update: 2024-01-06 15:01 GMT

జనసేన అధినేత వెండి తెర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు గౌరవ డాక్టరేట్ ని తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివెర్సిటీ ప్రకటించింది. నిజంగా పవన్ ఫ్యాన్స్ కి ఇది పండుగ లాంటి వార్త. పవన్ కళ్యాణ్ గత మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్నారు. గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఆయన సామాజిక సేవా కార్యక్రమాలకు గానూ గౌరవ డాక్టరేట్ ని ప్రకటిస్తున్నట్లుగా వేల్స్ యూనివర్శిటీ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ ని వేల్స్ యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ తో సత్కరించాలని భావిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ కి యూనివర్సిటీ పెద్దలు రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ తనకు గౌరవ డాక్టరేట్ వద్దు అని నిరాకరించడమే బిగ్ ట్విస్ట్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మేరకు యూనివర్శిటీ పెద్దలకు లేఖ రాస్తూ తన కంటే సమాజానికి సేవ చేసిన వారు చాలా మంది ఉన్నారని వారిని గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేయాలని కోరారు. అంతే కాదు తాను ఎన్నికల పనులలో బిజీగా ఉన్నానని స్నాతకోత్సవానికి హాజరు కావడం కుదరదు అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

తనను ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్ ని ఇవ్వాలనుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ డాక్టరేట్ ని ఒక గౌరవంగా భావిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే తాను తీసుకోలేనని పవన్ నిస్సహయతను వ్యక్తం చేశారు. దీంతో పవన్ అభిమానులు జనసేన సైనికులు ఒక వైపు ఆనందంతో పాటు మరో వైపు నిరాశకు గురి అవుతున్నారు.

తమ నేతలు గౌరవ డాక్టరేట్ రావడం గొప్ప విషయం అని ఆయన దాన్ని వద్దు అని నిరాకరించడం అంతకంటే గొప్ప విషయం అని వారు అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ డాక్టరేట్ తీసుకుని ఉంటే బాగుంటుండేది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి అవార్డులు అంటే ఇష్టం ఉండదని చెప్పడానికి డాక్టరేట్ ని ఆయన తీసుకోకపోవడమే ఒక ఉదాహరణ అంటున్నారు. తమ అభిమాన హీరో పవన్ హుందా అయిన మనిషి అని అందుకే ఆయన అవార్డులను ఎపుడూ కోరుకోరు అని అంటున్నారు.

పవన్ కి డాక్టరేట్ లభించడం ఒక బిగ్ న్యూస్ అయితే దాన్ని ఆయన కాదనుకోవడం అంతకంటే బిగ్ న్యూస్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ ఈ రోజు వద్దు అనుకున్న డాక్టరేట్ రేపు ఆయన్ని ఏదో రూపంలో వరించి వస్తుందని అభిమానులు సర్దిచెప్పుకుంటూ పోస్టింగులు పెడుతున్నారు.

Tags:    
  • Tollywood 
  • Actor 
  • Powerstar 
  • Andhrapradesh 
  • Janasena 
  • Cheif 
  • Pawankalyan 
  • Doctorate 
  • Velsuniversity 
  • Tamilnadu 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS