పవన్ కు డీఎంకే సవాల్... తలచుకుంటే పరిస్థితి ఏమిటి?

అవును... మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-24 06:11 GMT

తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తమిళనాట రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఎలక్షన్ స్టంట్స్ మొదలుపెట్టేశాయి అన్ని రాజకీయ పార్టీలు! ఆ సంగతి అలా ఉంటే తాజాగా మదురై నగరంలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి. దీంతో.. అధికార పక్షం నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి!

అవును... మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని కీలక ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడు" అనే ఆశయాన్ని ప్రతిపాదిస్తూ ధర్మం మార్గంలో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మురుగన్‌ పై విశ్వాసంతో విజయాన్ని సాధించవచ్చని చెప్పారు.

ఇదే సమయంలో... ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు.. ఒక ముస్లిం వారి మతాన్ని గౌరవించవచ్చు.. కానీ, హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం? అని ప్రశ్నించారు. దీంతో... సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, మొదలైన డీఎంకే నేతలు చేసిన వ్యాఖ్యలపై పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారనే కామెంట్లు వినిపించాయి.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి శేఖర్‌ బాబు స్పందించారు. ఈ సందర్భంగా పవన్ కు సవాల్ విసిరారు. ఇందులో భాగంగా... 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ము పవన్ కల్యాణ్‌ కు ఉందా? అని ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి అని సవాల్ విసిరారు.

అలా తమిళనాడు ఎన్నికల్లో పవన్‌ గెలిచిన తర్వాత ఎన్నిచెప్పినా వినడానికి సిద్ధమని ప్రకటించారు. అలా కాకుండా... అసలు తమిళనాడుతో పవన్‌ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన మంత్రి శేఖర్ బాబు... తమను ప్రశ్నించడానికి అతనెవరు? అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో.. బీజేపీ మాయలో పడి మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని సూచించారు.

దీంతో... డీఎంకే అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకుంటున్నట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... తమిళనాడులో పవన్ కు పెద్ద ఫ్యాన్ బెల్టే ఉందని.. దీనికితోడు అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పవన్ పోటీ చేస్తే గెలవడం పెద్ద విషయం కాదని.. ఆ పరిస్థితే వస్తే డీఎంకేకు కొత్త కష్టాలు మొదలైనట్లేనని అంటున్నారు.

Tags:    

Similar News