ప‌ల్నాడు రాజ‌కీయాలు ప‌దిలం.. టీడీపీకే ప్ల‌స్‌.. !

సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కీలకమైన జిల్లాల్లో పల్నాడు జిల్లా ఒకటి. ఇది రాజకీయంగా ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది.;

Update: 2026-03-09 14:30 GMT

పల్నాడు జిల్లాలో రాజకీయాలు ఎలా ఉన్నాయి.. అధికార కూట‌మి పార్టీల నాయకులు అదేవిధంగా విపక్ష వైసిపి నాయకుల రాజకీయాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి అనేది ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే. సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కీలకమైన జిల్లాల్లో పల్నాడు జిల్లా ఒకటి. ఇది రాజకీయంగా ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో రాజకీయాలు తరచుగా వివాదాలకు చోటు ఇవ్వడం నాయకుల మధ్య విభేదాలు కొనసాగడం వంటివి కామన్ గా మారింది.

వీటిలో మాచర్ల, గురజాల, వినుకొండ అత్యంత కీలకమైన నియోజకవర్గాలుగా ఉన్నాయి. ఈయన మూడు నియోజకవర్గాల్లో కూడా ఇటు వైసిపికి అటు టిడిపికి ప్రధాన సెగ్మెంట్లుగానే మారాయి. గత 2019 ఎన్నికల్లో ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇక మాచర్ల నియోజకవర్గం ఆది నుంచి వ్యక్తిగత రాజకీయాలకు కేంద్రంగా మారింది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాకు తిరుగు లేదన్న వాదన కూడా వినిపించింది. గత 2024 ఎన్నికల్లో మాత్రమే మాచర్లలో మార్పు దిశగా ప్రజలు ఓటేశారు.

టిడిపిని గెలిపించారు. ఇక వినుకొండ గురజాల నియోజకవర్గం లో బలమైన నాయకులు గా పేరుందిన య‌రపతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు మరోసారి తమ హవాను చాటుకున్నారు. అయితే వైసిపి హయాంలో ఉన్నప్పుడు వినుకొండ గురజాల నియోజకవర్గాలకు సంబంధించి అనేక రాజకీయ చర్చలు తెర‌మీద‌కు వచ్చాయి. నిత్యం వివాదాలు, ఘర్షణలకు ఈ రెండు నియోజకవర్గాలు కేంద్రంగా మారాయి. సొంత పార్టీలోనే నేతల మధ్య విభేదాలు అదేవిధంగా ప్రత్యర్థులపై కక్ష సాధింపు రాజకీయాలు వంటివి వినుకొండ గురజాలలో 2019- 24 మధ్య జోరుగా వినిపించాయి.

మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వినుకొండ నియోజకవర్గం లో వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు మౌనం పాటిస్తున్నారు. ఆయన అసలు బయటికి రావడం లేదు. గతంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించి కొంద‌రి నుంచి భూములను తక్కువ ధరకు కొని అవే భూములను ప్రభుత్వానికి ఎక్కువ ధ‌రకు విక్రయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై విచారణ జరిగే అవకాశం ఉండడంతో రాజకీయంగా మౌనంగా ఉంటే మంచిది అన్న ఉద్దేశంతో బ్రహ్మనాయుడు మౌనం పాటిస్తున్నారు.

దీనికి తోడు ఆయనకు అంతర్గత కుమ్ములాట‌లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వైసీపీలో బొల్లాన్ని వ్యతిరేకించే వర్గం ఎక్కువగా ఉంది. ఇక గురజాల నియోజకవర్గం విషయానికి వస్తే కాసు మహేష్ రెడ్డి వైసీపీ తరఫున వాయిస్ వినిపిస్తున్నప్పటికీ వివాదారహితంగానే ఆయన వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కేసుల్లో చిక్కుకుంటానోన‌న్న బెంగ కూడా ఆయనలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సో మొత్తంగా చూస్తే మాచర్ల నియోజకవర్గం లో వైసిపి ప్రస్తావన లేకపోవడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివిధ కేసుల్లో చిక్కుకుని జైల్లో ఉండడం, గురజాలలో వైసిపి నేత మౌనం పాటించటం ఇక వినుకొండలో వైసీపీ నేత‌లు మౌనంగా ఉండటంతో ఈ మూడు నియోజకవర్గాల్లో రాజకీయాలు ప్రశాంతంగా సాగుతున్నాయి అన్నది పరిశీలకులు చెబుతున్న మాట.

Tags:    

Similar News