భారత్ దాడి చేసింది ఉగ్రపుట్టలపైనే... ‘313’ గ్రూపు వీడియోలతో క్లారిటీ!
పాకిస్థాన్ నోరు విప్పితే అబద్దాలు, అసత్య ప్రచారాలే అని ఇటీవల భారత ప్రభుత్వం పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే.;
పాకిస్థాన్ నోరు విప్పితే అబద్దాలు, అసత్య ప్రచారాలే అని ఇటీవల భారత ప్రభుత్వం పదే పదే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిత్యం బలం చేకూర్చే సాక్ష్యాలు తెరపైకి వస్తుంటాయి. ఈ సమయంలో.. ప్రార్థనా మందిరాలపై భారత్ బాంబులు వేసిందంటూ పాక్ చేసిన ఆరోపణలకు.. సరిగ్గా కొట్టే కౌంటర్స్ అక్కడ బ్యాచ్ నుంచే వచ్చాయని తెలుస్తోంది.
అవును... అమాయకపు ప్రజలు, ప్రార్థనా మందిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించిందంటూ పాక్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఇన్ని కబుర్లు చెప్పే ముందు, భారత్ వంటి దేశంపై ఆరోపణలు చేసేముందు కాస్త మినిమం జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన చేయనట్టుంది. దీంతో.. మురీద్కేలోని ఉగ్రమూకల వీడియోలు బయటకు వచ్చాయి.
ఆపరేషన్ సిందూర్, అనంతరం పరిణామాల్లో పాక్ లోని ప్రార్థనా మందిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించిందనే ఆరోపణలకు.. స్కై న్యూస్ సమాధానం ఇచ్చింది! ఇందులో భాగంగా... మురిద్కేలోని మర్కజ్ తయ్యబ్బాకు సంబంధించి టిక్ టాక్, యూట్యూబ్, గూగుల్ లలో పోస్టు చేసిన వీడియోలను స్కైన్యూస్ సేకరించింది. 313 అనే గ్రూపు పోస్ట్ చేసిన వీడియోల్లో ఉన్న సమాచారం వెల్లడించింది.
ఈ వీడియోల జియో లొకేషన్లు చూడగా.. వాటిలో చాలా వరకూ లష్కరే, 313 అనే క్యాప్షన్స్ తో వచ్చాయని తేలిందని తెలిపింది. కాగా... బ్రీగేడ్ 313 అనేది పాకిస్థాన్ లోని ఆల్ ఖైదా విభాగం. దీనికిందే... తాలిబన్, లష్కరే జంగ్వీ, హర్కత్ ఉల్ జీహాద్, జైషే మహ్మద్, మొదలైన సంస్థలు ఉంటాయి. బ్యాటిల్ ఆఫ్ బద్ర్ కు గుర్తుగా 313 పేరు పెట్టుకున్నారు.
అలాంటి 313 గ్రూపు లో దొరికిన వీడియోల్లో... వీధుల్లో తుపాకులతో తిరుగుతున్న వ్యక్తులు.. మరోదానిలో, ఆయుధాలు వాడుతున్న పిల్లలు కనిపించారని చెబుతున్నారు. ఈ గ్రూపులోని సభ్యులంతా గరిష్టంగా టిక్ టాక్ నే వినియోగిస్తారని చెబుతున్నారు. దీంతో... భారత్ బాంబులు వేసింది ప్రార్థనా మందిరాలపై కాదు.. ఆ ముసుగులో ఉన్న ఉగ్రపుట్టలపై అనే విషయం స్పష్టమైంది.