• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ సైన్యం భారీ...

పాక్ సైన్యం భారీ ఆపరేషన్... వణికిపోతున్న సొంత ప్రజలు!

| పాకిస్థాన్ సైన్యం భారీస్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలోచిస్థాన్‌ సొంత ప్రజల పైనే దాడులు చేస్తోంది.

By - Raja Ch
Update: 2025-10-01 19:30 GMT

పాకిస్థాన్ సైన్యం భారీస్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బలోచిస్థాన్‌ సొంత ప్రజల పైనే దాడులు చేస్తోంది. ఈ సమయంలో పాకిస్థాన్ సైన్యం వాడుతోన్న శతఘ్నులు, మోర్టార్లతో ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. డ్రోన్ దాడులు, నిరంతర షెల్లింగ్ వల్ల ప్రాణనష్టం జరిగిందని నివేదికలు వస్తున్నాయి.

అవును... ఖుజ్దార్ జిల్లాలోని జెహ్రీలో సైనిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నాల్గవ రోజు కొనసాగుతున్న ఈ అణచివేత చర్య, కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగించిందని తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మూడు రోజుల పూర్తి లాక్‌ డౌన్ తర్వాత ఇంధనం, ఆహార కొరత తీవ్రంగా పెరుగుతోంది.

నాలుగవ రోజు పూర్తి లాక్ డౌన్ కొనసాగుతోందని తెలుస్తోంది. పాక్ సైన్యం చేస్తున్న వరుస బాంబు దాడులతో పత్తి పొలాలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని స్థానిక మీడియా పేర్కొంది. ఇదే సమయంలో.. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పూర్తిస్థాయి సమాచారం అందుబాటులోకి రావడం లేదు.

బలోచ్‌ లిబరేషన్ ఆర్మీ(బీ.ఎల్.ఏ), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీ.ఎల్.ఎఫ్) లక్ష్యంగా ఈ దాడులు జరుగుతుండగా... వాటి అధీనంలో ఉన్న జెహ్రీని తిరిగి స్వాధీనం చేసుకొనే లక్ష్యంతోనే పాకిస్థాన్ సైన్యం ఈ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో.. దండర్, మోరెంకితో సహా సమీప గ్రామాలు భారీ షెల్లింగ్‌ ను ఎదుర్కొన్నాయి.

కాగా... గతనెల ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా లోని మాత్రె దారా గ్రామంపై ఫైటర్‌ జెట్‌ లు ఎల్‌.ఎస్‌-6 రకం 8 బాంబులను జార విడిచిన సంగతి తెలిసిందే. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో భాగంగా గతంలో ఈ ప్రావిన్స్‌ లో దాడులు చేసింది. బలోచిస్థాన్‌ తర్వాత అత్యధికంగా ఉగ్రదాడులు జరిగేది ఈ ప్రావిన్స్‌ లోనే.

క్వెట్టా నగరం భారీ పేలుడు!:

పాకిస్థాన్‌ లోని క్వెట్టా నగరం మంగళవారం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఆ వెంటనే కాల్పుల మోత వినిపించింది. పారామిలిటరీ సిబ్బంది లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 10 మంది మృతి చెందగా 32 మంది గాయపడ్డారని బలోచిస్థాన్‌ ఆరోగ్య మంత్రి బఖ్త్‌ ముహమ్మద్‌ కకర్‌ తెలిపారు. ఈ సందర్భగా స్పందించిన బలోచిస్థాన్‌ ముఖ్యమంత్రి మిర్‌ సర్ఫ్రాజ్‌ బుగటి.. ఇది ఉగ్రవాదుల ఘాతుకమేనని పేర్కొన్నారు.

Tags:    
  • BalochistanCrisis 
  • PakistanArmy 
  • Khuzdar 
  • QuettaBlast 
  • AntiTerrorOps 
  • బలోచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్య దాడులు 
  • ఖుజ్దార్ జెహ్రీ షెల్లింగ్ 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS