పాకిస్థాన్ లో టర్కీ విమానాలు.. తెరపైకి కీలక నివేదికలు!
ఏప్రిల్ 22న జమూకశ్మీర్ లోని పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావారణ నెలకొన్న సంగతి తెలిసిందే.;
ఏప్రిల్ 22న జమూకశ్మీర్ లోని పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావారణ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇప్పటికే పాకిస్థాన్ కు దౌత్యపరమైన షాకులు ఇచ్చిన భారత్.. ఏ క్షణమైనా సైనిక చర్యకు ఉపక్రమించే అవకాశం ఉందని ఇస్లామాబాద్ వణుకుతుందని అంటున్నారు.
మరోపక్క అమెరికా, ఫ్రాన్స్, రష్యా, యూకే, జపాన్, యూఏఈ, ఇజ్రాయెల్ సహా ప్రపంచ శక్తులు వేగంగా, నిస్సందేహంగా ఈ ఉగ్రదాడిని ఖండించాయి. మరోపక్క ఉగ్రవాదంపై పోరాడే విషయంలో భారత్ కు సహకరించే విషయంలో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పాక్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో ఇప్పటికే చైనా మద్దతు సంపాదించింది పాకిస్థాన్. అయితే అమెరికాతో సుంకాల యుద్ధం జరుగుతున్న వేళ.. చైనాకు భారత్ అవసరం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. పాక్ కు ఆ దేశ సహకారం ఎంతమేరకు ఉంటుందనేది చర్చనీయాంశమైన అంశమే. మరోపక్క టర్కీ కూడా పాక్ కు మద్దతు ప్రకటించిందని తెలుస్తోంది.
అవును... కీలక దేశాల నుంచి దౌత్య సహాయం పొందడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో.. ఆ దేశంలో భయాందోళనలు నెలకొన్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి చైనా మద్దతు ఇచ్చినప్పటికీ.. అది ఎంత దూరం అనేది ప్రశ్నార్థకమే. ఈ సమయంలో పాక్ కు ఇస్తాంబుల్ సహకరించినట్లు సమాచారం!
ఇందులో భాగంగా... భారత్ ఏ క్షణమైనా సైనిక చర్యకు పాల్పడే అవకాశం ఉందని పాక్ భావిస్తున్న వేళ తన దౌత్య యంత్రంగాన్ని సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో టర్కీ సహకారం లభించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఇస్తాంబుల్.. పాకిస్థాన్ కు ఆయుధాలు సరఫరా చేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
ఈ మేరకు ఏప్రిల్ 27న పలు టర్కిష్ సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్ లో ల్యాండ్ అయినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. అంతకుమించి ప్రస్తుతం పాకిస్థాన్ కు మరో దౌత్యపరమైన సహకారం లభించే అవకాశాలు దాదాపు లేనట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి.