’సిందూర్’.. ఇది పూర్తి స్థాయి యుద్ధమే..? పాక్ పీక మీద కత్తి
1971 యుద్ధంలో, బాలాకోట్ సైనిక దాడుల్లో తప్ప చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం దాడి చేయలేదు.;
’సినిమా ఇంకా ఉంది..’ ఇది భారత మాజీ సైనిక ఉన్నతాధికారుల మాట..
’ప్రతీకారం తీర్చుకుంటాం’.. ఇది పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ గాంభీర్యం..
1971 యుద్ధంలో, బాలాకోట్ సైనిక దాడుల్లో తప్ప చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం దాడి చేయలేదు. ఆపరేషన్ సిందూర్ లో మాత్రం మళ్లీ ఆ పని చేసింది.
మరి ఇది ఎక్కడకు వెళ్తుంది..? అంటే సమాధానం కాస్త సీరియస్ గానే కనిపిస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ చెప్పినట్లుగా పాక్ ప్రతీకార దాడులకు దిగితే భారత్ మరింత దీటుగా బదులిస్తుంది. దీంతో ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారతాయి.
భారత్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించడమే కాక.. ఎయిర్ స్పేస్ ను 48 గంటల పాటు మూసివేసింది. ఆస్పత్రుల సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. రాజధాని ఇస్లామాబాద్, పంజాబ్ రాష్ట్రంలో సూళ్లను మూసివేసింది. దీన్నిబట్టి ఆ దేశం కూడా ఏదో ప్లానింగ్ లోనే ఉందని తెలిసిపోతోంది.
పాక్ ఎంత పేలినా 4 రోజులే?
అణ్వస్త్ర దేశమే అయినప్పటికీ పాకిస్థాన్ వి అన్నీ ప్రేలాపనలే. భారత్ తో నిజంగా యుద్ధమే వస్తే ఆ దేశం నాలుగు రోజులు కూడా నిలవలేదని ఇప్పటికే కథనాలు వచ్చాయి. ఇక పాకిస్థాన్ పై గట్టి ప్రతీకారం కోసం ఎన్నాళ్లుగానో అఫ్ఘాన్ పాలకులైన తాలిబాన్లు వేచి ఉన్నారు. బలూచిస్థాన్ లో పాక్ పాలకులకు వ్యతిరేకంగా బలమైన ఆందోళనలు జరుగుతున్నాయి. అన్నిటికి మించి పాక్ చాలా పేదరికంలో ఉంది. అలాంటప్పుడు యుద్ధం ఎన్నాళ్లని చేయగలదు?
సైనికంగా, ఆర్థికంగా పాకిస్థాన్ కు పూర్తి భిన్నంగా భారత్ అత్యంత పటిష్ఠ స్థితిలో ఉంది. దీంతోపాటు అంతర్జాతీయంగా భారత్ కే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధమే జరిగితే భారత్ పైచేయి సాధించడం ఖాయం. అప్పుడు పాకిస్థాన్ ను ఏం చేస్తుంది?