భారత్ కొట్టిన దెబ్బలు చూపిస్తున్న పాక్... పెద్దగా తగలలేదంటూ కవరింగ్!

ఆపరేషన్ సిందూర్ లో పాక్ ను ఏ విధంగా వణికించిందీ చెబుతూ.. భారత్ సాధించిన విజయాలను మన సైన్యం వెల్లడించింది.;

Update: 2025-05-12 09:37 GMT

ఆపరేషన్ సిందూర్ లో పాక్ ను ఏ విధంగా వణికించిందీ చెబుతూ.. భారత్ సాధించిన విజయాలను మన సైన్యం వెల్లడించింది. ఇందులో భాగంగా... పాక్ విమానాలను నేల కూల్చామని తెలిపింది. అసలు ఆ యుద్ధ విమానాలు భారత సరిహద్దు లోపలికే రానివ్వకుండా నిరోధించడం వల్ల వాటి శకలాలు తమ దగ్గర లేవని తెలిపింది.

ఇదే సమయలో... ఎన్ని యుద్ధ విమానాలను కాల్చామనే విషయంలో సంఖ్య చెప్పలేం కానీ.. కచ్చితంగా కూల్చామని మాత్రం చెప్పగలమని తెలిపింది. ఈ మేరకు ఎయిర్ మార్షల్ ఎ.కే. భారతి ఈ విషయాలను ఆదివారం మీడియా ముందు వెళ్లడించారు. అయితే... ఈ విషయంలో మొదటి నుంచీ తామే భారత యుద్ధ విమానాలు కూల్చామని చేసుకున్న పాక్.. తాజాగా ఒప్పుకుంది!

అవును... ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ కు భారీ నష్టం కలిగించామని.. ఆ దేశ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చామని భారత సైన్యం వెల్లడించిన అనంతరం తాజాగా పాకిస్థాన్ ఆర్మీ స్పందించింది. ఇందులో భాగంగా.. తమ ఫైటర్ జెట్ ఒకటి ధ్వంసమైన మాట నిజమేనని అంగీకరించింది. అయితే... అది స్వల్పమేనని చెప్పడం గమనార్హం.

పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ.. తమ దేశ ఎయిర్ ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... భారత్ లో జరిగిన సైనిక ఘర్షణల్లో పాక్ వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైందని వెల్లడించారు.

యుద్ధ విమానానం ధ్వంసం అవ్వడం ఏమిటి.. పైగా అది స్వల్పంగా ఉండటం ఏమిటనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై మాత్రం ఆయన పూర్తి వివరాలు వెల్లడించలేదు! ఏది ఏమైనా... భారత్ కొట్టిన ఒక్కో దెబ్బనూ చూపించుకుంటున్న పాక్.. పైగా అందులో కూడా స్వల్పం, కొంచమే అని ప్రిస్టేజ్ కి పోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News