• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత్‌ లో పేదరికంపై...

భారత్‌ లో పేదరికంపై "నీతి ఆయోగ్‌" ఆసక్తికర వ్యాఖ్యలు!

| ఈ సర్వేలో జనాభాను 20 రకాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెరిగిన నెలవారీ సగటు ఖర్చు వివరాలు వెల్లడించారు.

By - Tupaki Desk
Update: 2024-02-26 15:30 GMT

భారతదేశంలో అతిప్రధాన సమస్యల్లో ఒకటి పేదరికం! వాస్తవానికి ఒకప్పుడు భారతదేశానికి ఉన్న ప్రధాన సమస్యల్లో జనాభా ప్రధానంగా ఉండేది! అయితే... ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినా పేదరికం మాత్రం రూపుమాపలేకపోతున్నారు! అయితే ఈ విషయంపై తాజాగా నీతీ ఆయోగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... భారతదేశంలో పేదరికం స్థాయి 5శాతం దిగువకు పడిపోయిందని వెల్లడించింది.

అవును... భారతదేశంలో పేదరికం స్థాయి 5 శాతానికి దిగువకు పడిపోయిందని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని.. 2022-23 సమయలో చేపట్టిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్.సీ.ఈ.ఎస్) ను ఉంటంకిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణం వెల్లడించారు. ఈ సర్వేలో జనాభాను 20 రకాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెరిగిన నెలవారీ సగటు ఖర్చు వివరాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... పట్టణాలు, గ్రామాల్లో ప్రజల ఆదాయం పెరిగిందని నీతి ఆయోగ్ చేపట్టిన సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా... 2011-12 తో పోలిస్తే గ్రామాల్లో నెలవారీ ఖర్చులు సుమారు 40.42శాతం పెరిగి ఆ మొత్తం 2,008 రూపాయలు కాగా... పట్టణ ప్రాంతంలో నెలవారీ యావరేజ్ ఖర్చు 33.5 శాతం పెరిగి 3,510 రూపాయలుగా పెరిగిందని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో తాజా సర్వే డేటా ప్రకారం... దేశంలో పేదరికం 5 శాతం లేదా అంతకంటే కూడా తగ్గే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రజలు ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో కూడా మార్పులను ఈ సర్వే గుర్తించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు మొత్తం వ్యయంలో సుమారు 50శాతం కంటే తక్కువగా ఆహారం కోసం కేటాయించినట్లు సర్వేలో తేలిందని తెలిపారు.

ఇదే క్రమంలో... 2004 - 05 మధ్యకాలంలో గ్రామిణ ప్రాంతాల్లోని ప్రజలు, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు చేసే ఖర్చుల్లో వ్యత్యాసం ఏకంగ 91శాతం గా ఉండేదని చెప్పిన ఆయన... ఇప్పుడు ఆ వ్యత్యాసం 71శాతానికి తగ్గిపోయిందని సర్వే వెల్లడించిందని తెలిపారు. కచ్చితంగా ఇది మారుతున్న అసమానతల తగ్గుదలను సూచిస్తుందని సర్వే తెలిపింది.

ఈ క్రమంలో... కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైన ఆయుష్మాన్ భారత్, ఉచిత విద్య వంటి ప్రయోజనాలను సర్వేలో చేర్చలేదని చెప్పిన సుబ్రహ్మణ్యం... ఈ నివేదిక తెలిపిన వివరాల మేరకు భారత్‌ లో పేదరికం దాదాపు అదృశ్యమైందని చెప్పడం గమనార్హం!

Tags:    
  • Nitiaayog 
  • India 
  • Poverty 
  • Ceo 
  • Indiansliving 
  • Survey 
  • Subrahmanyam 
  • Food 

Similar News

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

Copyright @2026

Powered by Blink CMS