• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మొత్తానికి నితీష్ ని సీఎం...

మొత్తానికి నితీష్ ని సీఎం చేసేసారు

| మొత్తానికి ఆర్జేడీ పంతమే నెగ్గినట్లు అయింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఎ తన సీఎం అభ్యర్ధిని ప్రకటించింది. నితీష్ కుమార్ తమ కూటమి అభ్యర్ధిగా బీజేపీ అగ్ర నేత అమిత్ షా ప్రకటించారు.

By - Satya P
Update: 2025-10-29 21:30 GMT

బీహార్ లో రాజకీయం ఎత్తుకు పై ఎత్తుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎవరూ తీసిపోకుండా వ్య్హూహాలకు పదును పెడుతున్నారు. తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి వర్సెస్ మహా ఘట్ బంధన్ పోటా పోటీగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. మహా ఘట్ బంధన్ నుంచి తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్నారు. ఎన్డీయే నుంచి ఎవరు అని ఆ రోజు నుంచే గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఈ విషయంలో కార్నర్ చేయడమే మహా ఘట్ బంధన్ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.

చెబితే తంటా లేకుంటే మంట :

సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర కమలం పార్టీ ఆర్జేడీకి దొరికేసింది అని అంటున్నారు. ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పక్కాగా ప్లాన్ చేసింది. ఎందుకంటే నితీష్ కుమార్ ని అభ్యర్ధిగా ప్రకటిస్తే ఆయన పరిపాలన మీద ఉన్న యాంటీ ఇంకెంబెన్సీని కోరి కూటమి మీద వేసుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో యువకుడు అయిన తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ అంటే సహజంగానే మార్పు కోరే వారి మొగ్గు ఆ వైపుగా నూరు శాతం పోతుంది. యువత కూడా పూర్తిగా టర్న్ అవుతుంది. అలాగని కాదు అనుకుంటే జేడీయూ వర్సెస్ బీజేపీల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ఆర్జేడీ పాచిక పారుతుంది. దాంతో గురి చూసి మరీ మీ సీఎం అభ్యర్ధి ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేసింది.

ఎట్టకేలకు ఓకే :

మొత్తానికి ఆర్జేడీ పంతమే నెగ్గినట్లు అయింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఎ తన సీఎం అభ్యర్ధిని ప్రకటించింది. నితీష్ కుమార్ తమ కూటమి అభ్యర్ధిగా బీజేపీ అగ్ర నేత అమిత్ షా ప్రకటించారు. ఆయన సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెబుతూనే సీఎం గా నితీష్ ఉంటారని ఆయన సీటు ఇప్పట్లో ఖాళీ అయ్యే చాన్స్ లేదని కూడా అన్నారు. బీహార్ లో విపక్షానికి అసలు చాన్స్ లేనే లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆర్జేడీని పొరపాటున ఎన్నుకుంటే కనుక రాష్ట్రం మరో ఇరవై ఏళ్ళు వెనక్కు పోతుందని కూడా అమిత్ షా హెచ్చరించడం గమనార్హం. బీహార్ ని అభివృద్ధి పధంలో నడిపే సత్తా ఎన్డీయేకే ఉందని ఆయన చెబుతున్నారు.

పొరపాటు జరుగుతుందా :

అమిత్ షా మాటలే తీసుకుంటే పొరపాటున మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇబ్బందులో పడుతుందని అంటున్నారు. నిన్నటిదాకా మేమీ అధికారంలోకి వస్తామని చెప్పిన బీజేపీ పెద్దల నోట ఇపుడు పొరపాటున అయినా మహా ఘట్ బంధన్ ప్రసక్తి అయితే రాకూడదు కదా అని అంటున్నారు. మరి ప్రత్యర్థి కూటమి అధికారంలోకి వస్తే అంటూ ఆయన చెబుతున్న ఈ మాటలు చూస్తే ఎక్కడో ఏమైనా తేడా జరుగుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి నితీష్ కుమార్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటింప చేయడం ద్వారా ఆర్జేడీ సగం విజయం సాధించింది అని రేపటి ఎన్నికల్లో గెలిచి పూర్తి విజయం సాధిస్తుందని అంటున్నారు. చూడాలి మరి బీహార్ ఎన్నికలు ఏ తీరున సాగుతాయో ఫలితాలు ఏ విధంగా వస్తాయో మరి.

Tags:    
  • biharelections 
  • nitishkumar 
  • amitshah 
  • rjd 
  • tejashwiyadav 
  • nda 
  • mahagathbandhan 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS