ఒక్క ట్వీట్ తో సంచలనం రేపిన లోకేష్

మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు.;

Update: 2025-12-15 17:45 GMT

మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులను కలుస్తూ బిజీగా ఉన్నారు. అంతే కాదు ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టుల అనుమతిని కూడా ఆయన కోరుకున్నారు. అదే సమయంలో ఆయన సోషల్ మీడియాకు కూడా పని చెప్పారు. ఒకే ఒక్క ట్వీట్ ఆయన చేశారు. అదే ఇపుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటి అందులో మ్యాటర్ ఏంటి అంటే అది వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాల్సిందే.

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు :

లోకేష్ ఇపుడు ఏమి మాట్లాడినా విశాఖ గురించే ప్రస్తావిస్తున్నారు. విశాఖలోనే అనేక ఐటీ కంపెనీలు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. అలా నెలలో అనేక సార్లు విశాఖకు వస్తున్న లోకేష్ ఇపుడు విశాఖను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు అంటూ లోకేష్ ఇందులో ప్రస్తావించారు. వారు ఎవరు ఏమిటి అన్నది మాత్రం ఆయన చెప్పలేదు, వెయిట్ చేయాల్సిందే అన్నట్లుగా వదిలేశారు.

ఎవరో ఊహించగలరా :

ఇక చూస్తే ఆ వచ్చే ప్రపంచ ఛాంపియన్లు ఎవరో ఊహించగలరా అంటూ లోకేష్ ఏకంగా నెటిజన్లకు పెద్ద సవాల్ నే విసిరారు. ఇలా ఒక్క పోస్ట్ తో లోకేష్ ప్రకంపనలు రేపారు. ఇది సర్వత్రా ఆసక్తితో పాటు ఊహాగానాలకు సైతం దారి తీస్తోంది. త్వరలో విశాఖపట్నానికి ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారని లోకేష్ చెప్పడం ఒక ఎత్తు అయితే ఈ నెలలోనే అని చెప్పడం మరో ఎత్తుగా ఉంది. దానో మరీ ముఖ్యంగా విశాఖ ప్రజలలో ఈ ట్వీట్ మీద బాగా క్యూరియాసిటీ ఏర్పడింది.

వైజాగ్ సిద్ధంగా ఉండాల్సిందే :

విశాఖ ఇపుడు ఏ విషయం చూసినా కనిపిస్తోంది. ఇదే ప్రచారం కూడా అవుతోంది. ఈ నేపధ్యంలో విశాఖ సిద్ధంగా ఉండు అంటూ లోకేష్ వేసిన ఈ ట్వీట్ దేని గురించి ఏమై ఉంటుంది అన్నదే హాట్ డిస్కషన్ గా ఉంది. నిజానికి చాంపియన్ అన్న వర్డ్ ఎక్కువగా క్రీడా రంగానికి సంబంధించి వాడుతూంటారు. అయితే ఏ రంగంలో అయినా చాంపియన్స్ ఉంటారు, అలాగే ఇపుడు ఐటీ ఫీల్డ్ లో సైతం చాంపియన్స్ ఉన్నారు మరి ఇందులో ఏ ఫీల్డ్ కి చెందిన వారు ఉన్నారు ఎవరు వారు అన్నదే చర్చగా ఉంది.

మరో క్రేజీ ప్రాజెక్ట్ :

విశాఖకు ఇపుడు అనేక ప్రాజెక్టులు వరసగా తరలి వస్తున్నాయి. అందులో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా జత కాబోతోందా అన్నదే అంతా ఆలోచిస్తున్న విషయం. అందుకేనా లోకేష్ ఏకంగా వరల్డ్ వైడ్ చాంపియన్స్ తో పోలుస్తూ విశాఖ రెడీగా ఉండమంటున్నారు అని కూడా డిస్కస్ చేస్తున్నారు. సరే ఎవరు ఎన్ని అనుకున్నా ఎంతగా ఊహించుకున్నా కూడా మంత్రి నారా లోకేష్ మరో ట్వీట్ వేసి దానికి ఆన్సర్ చెబితేనే తప్ప అది తెలిసేది ఉండదు, సో విశాఖకు ఏదో సంచలనమే రాబోతోంది. అది భారీ ప్రాజెక్ట్ అవుతుందని మాత్రం అంతా ఊహిస్తున్నారు. సో చూడాలి మరి ఆ ప్రాజెక్ట్ ఏమిటో ఆ వివరాలు ఏమిటో.



Tags:    

Similar News