• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రి వర్గ...

మంత్రి వర్గ విస్తరణ...క్లారిటీ వచ్చినట్లేనా ?

| ఏపీలో రాజకీయం చకచకా మారుతోంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ తనదైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది.

By - Satya P
Update: 2026-04-16 19:30 GMT

ఏపీలో రాజకీయం చకచకా మారుతోంది. కూటమికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ తనదైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను టీడీపీ తీసుకుంది. ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలను పూర్తి చేసింది. లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అని గత మహానాడులోనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కానీ ఈసారి మహానాడుకు ముందుగానే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. దాంతో ఒక విధంగా పార్టీ బాధ్యతలను లోకేష్ చేతిలో పెట్టినట్లు అయింది.

మహానాడు తరువాత :

దీంతో ఈసారి మహానాడుకు లోకేష్ కొత్త బాధ్యతలతో అడుగు పెడతారు అని అంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన పాల్గొనే తొలి మీటింగ్ ఇదే కాబోతోంది. ఆ విధంగా టీడీపీ మీద పూర్తి పట్టుని సాధించేందుకు ఈ కీలక సమావేశం లోకేష్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇక మహానాడు తరువాత జూన్ నెలలో టీడీపీ కూటమి రెండేళ్ల పాలన పూర్తి అవుతుంది. దాంతో మంత్రి వర్గ విస్తరణ కూడా సరైన ముహూర్తం పెట్టుకుని చేస్తారు అని అంటున్నారు.

ఈ కూర్పుతోనే ఆ మార్పు :

పార్టీ పదవుల విషయంలో అనుసరించిన కూర్పుతోనే మంత్రి వర్గ విస్తరణలోనే మార్పులు చేస్తారు అని అంటున్నారు. ఎక్కువ మంది యువతకు పార్టీలో ప్రాధాన్యత కల్పించారు. దాంతో ఇదే వరసలో ప్రభుత్వంలోనూ యువతకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇప్పటికే కూటమి మంత్రులలో మెజారిటీ కొత్త వారే ఉన్నారు. అరడజన్ లోపే సీనియర్ మంత్రులు ఉన్నారు. కానీ ఈసారి చేసే మార్పులలో కొత్త వారు అంటే ప్రభుత్వం గురించి మరింత ధాటీగా జనంలోకి తీసుకుని వెళ్ళే వారిని తీసుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్లు జూనియర్లకు కూడా స్థాన చలనం ఉంటుందని అంటున్నారు.

కొత్త వారికే చాన్స్ :

టీడీపీ కమిటీలను చూసిన వారికి అయితే ఒక విషయం అర్ధం అయిపోయింది. పార్టీ పదవులు అయినా మంత్రి పదవులు అయినా కొత్త వారికే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. టీడీపీ మీద తనదైన ముద్రను బలంగా వేసిన లోకేష్ ప్రభుత్వంలో మార్పులు జరిగితే అక్కడా తన మార్క్ చూపిస్తారు అని అంటున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ భారీ స్థాయిలో ఉంటుందా లేదా మూడు నాలుగు పదవులతో భర్తీ చేసి అక్కడితో ముగిస్తారా అన్నది అయితే తేలాల్సి ఉంది. ఒక్కటి మాత్రం వాస్తవం అంటున్నారు. గతంలో జగన్ చేసినట్లుగా మొత్తానికి మొత్తం మంత్రులను మార్చేసి కొత్త వారిని తీసుకోవడం జరగదని కొద్ది మందినే మార్చి అనుకున్న విధంగా మంత్రి వర్గం కసరత్తుని ముగిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ కమిటీల ప్రకటన తర్వాత అందరి చూపు మంత్రి వర్గ విస్తరణ మీదనే ఉంది. మరి ఆ ముహూర్తం ఎపుడు ఏమిటి అన్నదే వేచి చూడాల్సి ఉంది.

Tags:    
  • naralokesh 
  • tdp 
  • appolitics 
  • cabinetexpansion 
  • apgovernment 
  • chandrababu 
  • cabinetreshuffle 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS