• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కుంభమేళాలో తొలి స్నానం...

కుంభమేళాలో తొలి స్నానం చేసేదెవరో తెలుసా?

| ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జరిగే ఈ మహా కుంభమేళాలో తొలి స్నానం ఎవరు చేస్తారనేది ఆసక్తికరం.

By - Tupaki Desk
Update: 2025-01-07 18:30 GMT

ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు ఎంతో విశిష్ఠత ఉంది. ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కుంభమేళాలో స్నానమాచరించాలని హిందూ ధర్మం చెబుతుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కుంభమేళా ఈ నెల 13న మొదలవుతుంది. వచ్చేనెల 26తో ముగుస్తుంది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జరిగే ఈ మహా కుంభమేళాలో తొలి స్నానం ఎవరు చేస్తారనేది ఆసక్తికరం.

సాధారణంగా ప్రభుత్వ పరమైన ఏ వేడుకలు ప్రారంభమైనా ప్రభుత్వాధినేతలు ప్రారంభించడం ఆనవాయితీ. ప్రతి ఏటా నిర్వహించే పుష్కరాలను ఆయా ప్రాంతాల్లో సీఎంలు ప్రారంభించడం, వారే తొలి స్నానం చేయడం ఒక పద్ధతిగా వస్తోంది. ఇదే సమయంలో హిందూ ఆలయాల్లో వేడుకలు నిర్వహిస్తే ఆయా ఆలయాల ధర్మకర్తలు తొలి పూజ చేసే అవకాశం దక్కించుకుంటారు. కానీ, కుంభమేళాలో ఇలా అధికారిక పదవులు ఉన్నవారు ఎవరూ తొలి స్నానం చేసేందుకు అర్హులు కారు. ఈ మహా కుంభమేళా ప్రారంభ సూచికగా నాగసాధువులు తొలి స్నానం చేస్తేనే వేడుక మొదలైనట్లు.

ప్రయాగ్ రాజ్లో జరిగే కుంభమేళా వేడుకలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుమారు రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తుంది. కేంద్రం కూడా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తుంది. అయినప్పటికీ ప్రధాని, సీఎం వంటివారు ప్రారంభ కార్యక్రమంలో నామమాత్రంగానే చెబుతున్నారు. హిమాలయాల నుంచి వచ్చే నాగసాధువులు తొలి స్నానంగా చెప్పే రాజ్యస్నానం చేస్తేనే అధికారికంగా మహా కుంభమేళా ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

నాగసాధువులను మహాయోధ సాధువులుగా పిలుస్తారు. పురాతన కాలం నుంచి హిందూ మతానికి రక్షకులుగా నిలిచిన నాగసాధువులు దేవుడి సైన్యంగా చెబుతుంటారు. అందుకే నాగసాధువులు స్నానమాచరించాకనే మిగిలిన యాత్రికులకు అనుమతిస్తారు.

Tags:    
  • KumbhMela 
  • NagaSadhus 
  • Prayagraj 
  • KumbhMela2025 
  • HinduRituals 
  • SacredBath 
  • IndiaCulture 
  • Hinduism 
  • SpiritualJourney 
  • MahaKumbhMela 
  • PrayagrajKumbh 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS