• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇన్ స్టాలో పరిచయమైనోడి...

ఇన్ స్టాలో పరిచయమైనోడి కోసం కన్నపేగును బస్టాండ్ లో వదిలేసింది

| విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా చేదుగా మారే సంఘటలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.

By - Tupaki Desk
Update: 2025-07-28 08:41 GMT

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా చేదుగా మారే సంఘటలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. సాటి మనిషిని నమ్మే పరిస్థితుల్ని పక్కన పెడితే.. అయినోళ్లను సైతం అనుమానంగా చూసే పాడు రోజులు దాపురించాయి. అన్నింటికి మించి కట్టుకున్న భర్తను.. కన్నబిడ్డల్ని సైతం తాత్కాలిక ఆనందాల కోసం.. అదనపు సుఖాల కోసం అడ్డు తొలిగించుకుంటున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. తాజాగా అలాంటి మరో ఉదంతం వెలుగు చూసింది.

ఇన్ స్టాలో పరిచయమైనోడి కోసం.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయిన ఒక పాపిష్టి అమ్మ ఉదంతం తాజాగా వెలుగు చూసింది. ఈ అమానవీయ ఘటన నల్గొండ బస్టాండ్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని బోడుప్పల్ ప్రాంతానికి చెందిన ఒక వివాహితకు హాలియా మండల కేంద్రానికి చెందిన నరేశ్ తో ఇన్ స్టాలో పరిచయమైంది. అది కాస్తా.. అంతకు మించి ముందుకు వెళ్లింది. నల్గొండలో ఉంటున్న అతడ్ని కలిసేందుకు వచ్చిన ఆమె.. తన పద్దెనిమిది నెలల కొడుకును బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయింది.

హైదరాబాద్ నుంచి నల్గొండ బస్టాండ్ కు చేరుకున్న ఆమె.. కాసేపు అక్కడే ఉండి.. టూవీలర్ మీద వచ్చిన తన ప్రియుడితో కలిసి వెళ్లేందుకు.. చిన్నారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అప్పటివరకు కన్నతల్లి సంరక్షణలో ఉన్న ఆ చిన్నారి.. తల్లి కనిపించకపోవటంతో గుక్కపట్టి ఏడవటం మొదలు పెట్టారు. దీంతో.. అక్కడున్న వారు చిన్నారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన వారు బస్టాండ్ లో ఉన్న సీసీ కెమేరాల్ని తనిఖీ చేయగా.. బిడ్డను బస్టాండ్ లో వదిలేసిన వైనాన్ని గుర్తించారు.

టూవీలర్ ను ట్రేస్ చేసిన పోలీసులు.. దాని రిజిస్ట్రేషన్ ఆధారంగా నరేశ్ ను గుర్తించి.. అతడ్ని.. అతడితో ఉన్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని భర్తకు సమాచారం అందించి.. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి.. బాలుడ్ని అప్పజెప్పారు. సమాచారం అందుకున్నంతనే స్పందించిన పోలీసు సిబ్బంది తీరు పలువురు అభినందిస్తున్నారు.

Tags:    
  • NalgondaIncident 
  • MotherAbandonsChild 
  • SocialMediaAddiction 
  • TelanganaNews 
  • HumanityLost 
  • CCTVFootage 
  • ShockingReality 
  • InstagramTrap 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS