జగన్ కి మోడీకి అదొక్కటే మిగిలింది !
ఏపీలో బీజేపీ నేతలు వైసీపీకి వ్యతిరేకం అయినా కేంద్రంలో బీజేపీ పెద్దలు వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంటూ వచ్చింది.;
వైసీపీ అధినాయకత్వానికి ఎన్డీయే మరోసారి గట్టి ఝలక్ ఇచ్చింది. నిజానికి ఎన్డీయే ఎపుడూ వైసీపీకి అనుకూలంగా ఉందా అంటే అది ఆలోచించాల్సిందే. అది కూడా ఉండాల్సిన అవసరం సైతం లేదు. ఎందుకంటే దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ బలమైన పార్టీ. వరసగా అనేక ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న పార్టీ. ఇక ఉత్తరాదిన పూర్తి స్థాయిలో బలపడి దక్షిణాదిన సైతం తన ఆధిక్యాన్ని చూపించడానికి ఉవ్విళ్ళూరుతున్న పార్టీగా ఉంది. ఇక చూస్తే ఎన్ డీయేకి వైసీపీ ఎపుడూ బహిరంగ మిత్రుడు కాదు, మరో వైపు చూస్తే కనుక ఏపీలో టీడీపీ విషయంలో 2014 నుంచి 2019 మధ్య బీజేపీకి అంతగా నమ్మకం లేదు అని చెబుతారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం మారింది. ఇపుడు మధ్యలో జనసేన కూడా ఉంది. అందువల్ల ఈ బంధం గట్టిగానే ఉంటుంది. దాంతో ఎన్డీయేకి ఏపీలో కూటమి చాలా ముఖ్యం. వైసీపీ అవసరం అయితే లేదు అని అంటున్నారు.
అదొక ముచ్చటగా :
ఇక చూస్తే 2019 నుంచి 2024 మధ్యన ఉన్నది ఎన్డీయే వైసీపీల మధ్య ఏమైనా బంధం ఉంది అని ఎవరైనా అనుకున్నది చూస్తే అదొక ముచ్చట మాత్రమే అని అంటున్నారు. వైసీపీ అవసరాలు కేంద్రంలో మరీ ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీకి ఉన్నాయని చెబుతారు. అలాగే వైసీపీకి కూడా కేంద్రంతో అవసరం ఉంది అని అంటారు. అందుకే అలా బంధం కుదిరింది అని అంటారు. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి ఎన్డీయే లోకి టీడీపీని ఆహ్వానించడం ద్వారా మరోసారి ఏపీ రాజకీయాలను మార్చింది. ఆ మీదట ఫలితాలను కూడా పొందింది. కానీ ఈ విషయంలో వైసీపీ అయితే ఏ విధమైన కొత్త ఎత్తులు వేయలేకనే చతికిలపడింది అని అంటున్నారు.
ఆ డౌటూ తీరిందా :
ఏపీలో బీజేపీ నేతలు వైసీపీకి వ్యతిరేకం అయినా కేంద్రంలో బీజేపీ పెద్దలు వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నారు అన్నది ఒక ప్రచారంగా ఉంటూ వచ్చింది. తాజాగా దక్షిణాది ఎంపీలతో అందులోనూ ఏపీ ఎంపీలతో మోడీ మాట్లాడుతూ ఏపీలో వైసీపీని గట్టిగా టార్గెట్ చేయాలని కోరడం చూస్తే వైసీపీ మీదకు బీజేపీ జాతీయ నాయకత్వమే దూకుడు చేయడానికి చూస్తోంది అని అంటున్నారు. దాంతో ఏమైనా సందేహాలు ఉన్నట్లు అయితే కనుక కచ్చితంగా అవి వీడిపోయాయి అని చెబుతున్నారు.
ఏపీకి మోడీ వస్తే :
ఇక ఏపీకి మోడీ వస్తే కనుక ఈసారి బహిరంగ సభలలో జగన్ మీద నేరుగా ఎటాక్ చేస్తారు అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఇప్పటిదాకా మోడీ సైలెంట్ గా ఉంటూ వచ్చారు. కానీ దేశంలో రాజకీయం మారుతోంది. దాంతో ఏపీలో కూడా బీజేపీకి ఒక క్లారిటీ వచ్చింది. అదే సమయంలో ఏపీలో కూటమి పార్టీల మీద నమ్మకం ఉందా అన్నది పక్కన పెడితే ఎన్డీయే గూటిని వీడి ఎవరూ బయటకు వెళ్లలేరన్నది అర్ధం అయిన తరువాత వైసీపీ మీదనే బీజేపీ టార్గెట్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఏమైనా షాకింగ్ పరిణామాలు చూడాలి అంటే కనుక 2026 వచ్చేదాకా వెయిట్ చేస్తే చాలు అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.