• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రి సబితా గన్ మెన్...

మంత్రి సబితా గన్ మెన్ సూసైడ్

| అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మ్యాన్ ఆత్మహత్య చేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-05 06:04 GMT

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మ్యాన్ ఆత్మహత్య చేసుకున్నారు. పిస్టల్ తో తనను తాను కాల్చుకొని చనిపోయాడు. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఉదంతం కలకలాన్ని రేపింది. కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసమైన శ్రీనగర్ కాలనీలోని ఒక హోటల్లో మంత్రి గన్ మ్యాన్ సూసైడ్ చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవటానికి ముందు కొడుకుతో మాట్లాడిన అతను ఈ విపరీత చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

కొన్నేళ్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గన్ మెన్ గా వ్యవహరిస్తున్న ఫజల్ అలీ.. ఈ తరహాలో తనను తాను కాల్చుకొని చనిపోవటాన్ని తోటి సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ తరహా చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు ఆత్మహత్యకు కారణమంటున్నారు.

ఆదివారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఫజల్ అలీ.. తన కుమార్తెను కూడా వెంట పెట్టుకొని తెచ్చారని.. ఇంట్లోని విషయాలు ఆమెతో చర్చించినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. మంత్రి సబితా.. వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ లు ఘటనా స్థలానికి చేరుకొని వివరాల్ని సేకరించారు. గన్ మెన్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రి సబితాకు ఎస్కార్ట్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఫజల్ అలీ ఆత్మహత్య చేసుకోవటాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    
  • Ministersabitha 
  • BRS 
  • Telangana 
  • Latestnews 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS