• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్రదర్ బ్రిలియంట్ ...

బ్రదర్ బ్రిలియంట్ ఫెర్మార్మెన్స్... కేటీఆర్ ట్వీట్ వైరల్!

| ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో "చంద్రబాబు @ రాజమండ్రి సెంట్రల్ జైల్" అనేది హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-09-11 05:31 GMT

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో "చంద్రబాబు @ రాజమండ్రి సెంట్రల్ జైల్" అనేది హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ పై టీడీపీ శ్రేణులు ధర్నాలు చేస్తుంటే... "పాపం పండింది, ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుంది" అని వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆన్ లైన్ వేదికగా దర్శనమిస్తున్న కొన్ని పోస్టులు, వాటి కింద కనిపించే కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఈ సమయంలో కేటీఆర్ ట్వీట్ ఆసక్తిగా మారింది!

ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించిన చంద్రబాబు అరెస్ట్ అనంతరం రిమాండ్ కోసం ఇరువైపులా వాదనలు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన వాదనల అనంతరం జడ్జి తీర్పు వెలువరించేటప్పటికి సమయం సాయంత్రం సుమారు 7 గంటలు అయ్యింది! సరిగ్గా 7:13కి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. దీంతో... ఇది చంద్రబాబు అరెస్ట్ గురించే అయ్యుండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

క్లుప్తంగా చెప్పాలంటే... "ఈ షో చూసి ఎంతో ఎంజాయ్ చేశాను... నా బ్రదర్ బ్రిలియంట్ ఫెర్మార్మెన్స్ కి నా అభినందనలు" అని అర్ధమొచ్చేలా కేటీఆర్ ట్వీట్ ఉంది! దీంతో... నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటల నుంచి విజయవాడలో ఆదివారం రాత్రి 7 గంటల వరకూ జరిగిన రసవత్తర సన్నివేశాలు చూసి తాను ఎంజాయ్ చేసినట్లు కేటీఆర్ పరోక్షంగా చెప్పారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు!

ఇదే సమయంలో "చాలా కాలం తర్వాత బాగా నవ్వుకున్నాను.. నీ బ్రిలియంట్ ఫెర్మార్మెన్స్ కి నా అభినందననలు బ్రదర్" అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించి ఉంటారు అంటూ ఆ ట్వీట్లకు భావానువాదం చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కచ్చితంగా ఈ ట్వీట్ “చంద్రబాబు అరెస్ట్ గురించిన పరోక్ష స్పందన” అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ ట్వీట్ కి ఆన్ లైన్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు నెటిజన్లు. ఇందులో ముఖ్యంగా... "టైమింగ్ ముఖ్యం అన్నారు పెద్దలు" అని వచ్చిన రిప్లై ఈ భావానువాదానికి మరింత బలం చేకూరుస్తుంది. ఇదే సమయంలో... "ఇన్ డైరెక్ట్ గా బలే వేశావు అన్నా" అంటూ మరో నెటిజన్ ఈ పోస్ట్ పై కామెంట్ చేశారు.

ఇదే క్రమంలో... "టైం చూసి వేశావుగా.. మామూలు ర్యాగింగ్ కాదు ఇది.. మినిమం డిగ్రీ ఉండాలి" అంటూ మరో నెటిజన్ స్పందించాడు. ఇలా ఈ ట్వీట్ కి భావానువాదం చేసుకున్న నెటిజన్లు... ఇది చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించిన స్పందనే అని కన్ ఫాం చేస్తున్నారు!

ఇదే సమయంలో "ఎక్స్ పెక్ట్ చేయలేదు సర్ మీ నుండి ఇలాంటి రాగింగ్. నాదొక హంబుల్ రిక్వస్ట్. జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి పార్టీ చేసుకోండి" అంటూ కామెంట్ చేసిన ఒక నెటిజన్... కేటీఆర్ – జగన్ లు హగ్ చేసుకున్న వీడియో బైట్ ని పోస్ట్ చేశాడు.

ఇదే క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ చేతులెత్తి దన్నం పెడుతున్నట్లుగా ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన నెటిజన్... "థాంక్స్ టు వైఎస్ జగన్" అని కామెంట్ చేశారు. ఇలా కేటీఆర్ చేసిన ట్వీట్ పరోక్షంగా చంద్రబాబు జైలుకి వెల్లడం గురించే అని నిర్ధారణకు వచ్చిన నెటిజన్లు... వైరల్ గా రియాక్ట్ అవుతున్నారు.

Thoroughly enjoyed the terrific show #NothingMakesSense by @varungrover yesterday in Hyderabad Haven’t laughed so much in a long time. My compliments brother on the brilliant performance 👏

— KTR (@KTRBRS) September 10, 2023
Tags:    
  • MinisterKTR 
  • TwitterX 
  • BRSParty 
  • Cbnarrest 
  • Andhrapradesh 
  • Telangana 

Similar News

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS