• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రి గుడివాడకు పార్టీ...

మంత్రి గుడివాడకు పార్టీ బాధ్యతలు...పోటీకి నో చాన్స్...!?

| ఆయనను విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ వైసీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది.

By - Tupaki Desk
Update: 2024-02-10 17:35 GMT

వైసీపీ అధినాయకత్వం విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయనను విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ వైసీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది. అంటే ఆయన విశాఖ, అనకాపల్లి అరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలలో పార్టీ విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది.

యధా ప్రకారం ఈ నియోజకవర్గాలకు వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉంటారు. ఆయనతో కలసి గుడివాడ పనిచేస్తారు అన్న మాట. ఇక పోతే వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం. పైగా ఆయనకు పెద్దల సభలో అకామిడేషన్ ఉంది.

కానీ యువ మంత్రిగా ఉంటూ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న గుడివాడకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆంతర్యం ఏమిటి అన్నదే ఆయన అనుచరులకు అర్ధం కావడం లేదు. కేవలం గుడివాడకే ఈ బాధ్యతలు అప్పగించలేదు. ఆయనతో వైసీపీలో మరింతమందికి కూడా పార్టీ బాధ్యలను ఆ పార్టీ అధినాయకత్వం అప్పగించింది.

అలా చూసుకుంటే కనుక ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. అలాగే విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణుకి చాన్స్ ఇచ్చారు. ఇక గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారు. అదే విధంగా కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్‌ కోఆర్డినేటర్‌గా పి.రామసుబ్బారెడ్డిని, కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌గా కె.సురేష్‌బాబుని నియమించారు.

ఇందులో చాలా మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. వారంతా పార్టీ పనికోసమే నియమితులు అయ్యారు. అలా చూసుకుంటే గుడివాడ సేవలను పార్టీ కోసం వాడుకుంటున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇటీవల గుడివాడ మీడియాతో మాట్లాడుతూ తన సేవలను పార్టీ ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా తాను పనిచేస్తాను అని చెప్పారు. అంటే గుడివాడకు ఈ సంగతి ముందే చెప్పారా అన్న చర్చ వస్తోంది. ఒకవేళ అదే నిజం అయితే ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కని తొలి మంత్రిగా గుడివాడ ఉంటారా అన్నదే ఆయన అనుచరులకు కలవరంగా ఉందిట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    
  • Apelections 
  • Ycp 
  • Tdp 
  • Janasenaparty 
  • Congressparty 
  • Bjp 
  • Jaganmohanreddy 
  • Gudivadaamarnath 

Similar News

24 గంటల్లో రాజీనామా లేదంటే ఉద్వాసన.. టెక్ దిగ్గజం గూగుల్‌లో అసలేం జరుగుతోంది?

2026-11-24 09:54 GMT

అమెరికా కలకు బీటలు.. ఆ బంగారు పంజరాన్ని వీడి సొంత గూటికి భారతీయ టెకీల పయనం

2026-11-24 09:52 GMT

బొత్స వర్సెస్ చిన్న శ్రీను.. చీపురుపల్లిలో డైరెక్ట్ ఫైట్

2026-11-24 08:43 GMT

అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే చిక్కులు.. సీఎం విజయ్ కి అసలు సిసలు పరీక్ష

2026-11-24 08:42 GMT

ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...రాహుల్ నజర్

2026-11-24 08:33 GMT

పూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవం.. వీడియో వైరల్!

2026-11-24 08:31 GMT

బీజేపీలో మోడీ స్వామ్యం...రాష్ట్రాలలో పార్టీ బలహీనం

2026-11-24 08:29 GMT

ఎన్విడియా ఆఫీసులో జెన్సన్ హువాంగ్‌ రీ ఎంట్రీ.. ఉద్యోగుల గ్రాండ్ వెల్కమ్.. ఆ భావోద్వేగ క్షణాలు వైరల్

2026-11-24 08:24 GMT

షేక్ హసీనా... చావుకు ఎదురెళ్తున్నారా ?

2026-11-24 08:24 GMT

ఆస్తుల ప్రదర్శనతో చిక్కులు.. గోల్డ్ మ్యాన్ యాదగిరికి ఐటీ షాక్

2026-11-24 08:09 GMT

భారత పాస్‌పోర్టుకు షాక్.. వీసా లేకుండా వెళ్లే దేశాలు తగ్గాయ్!

2026-11-24 06:30 GMT

యుద్ధం అంటే వినాశనమే.. రాలిపోయిన 7 లక్షల రష్యన్ల ప్రాణాల కన్నీటి కథ

2026-11-24 05:43 GMT

Copyright @2026

Powered by Blink CMS