• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అధికారంలోకి వచ్చిన ఆరు...

అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే చిక్కులు.. సీఎం విజయ్ కి అసలు సిసలు పరీక్ష

| తమిళనాడు సీఎం విజయ్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే అరుళ్ విగ్నేష్ వ్యవహారం తలనొప్పిగా మారింది. కళ్లకురిచ్చి కలెక్టర్ పద్మజను వేధించారనే ఆరోపణలపై ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించగా, అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సొంత ఎమ్మెల్యేపై విజయ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

By - Tupaki Political Desk
Update: 2026-11-24 08:42 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్‌కు ఇప్పుడు అసలైన రాజకీయ పరీక్ష ఎదురైందని చెబుతున్నారు. తన అద్భుతమైన ఇమేజ్‌తో ఎంతో మంది సామాన్యులను, కొత్త ముఖాలను అసెంబ్లీకి పంపిన విజయ్‌కు ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారశైలే తలనొప్పిగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా కళ్లకురిచ్చి ఎమ్మెల్యే సి.అరుళ్ విగ్నేష్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను రాజకీయ తుఫానుకు దారితీసింది. ఏకంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి పట్ల సదరు ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి.

కళ్లకురిచ్చి జిల్లా కలెక్టరుకు టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విగ్నేష్ కొన్ని నెలలుగా అసభ్యకరమైన, అనవసరమైన వాట్సాప్ మెసేజ్‌లు పంపి వేధిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, బహిరంగ కార్యక్రమాల్లో కలెక్టర్ వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించడం వంటి ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. గతంలో మద్యం మత్తులో కలెక్టర్ అధికారిక నివాసానికి వెళ్లి హంగామా సృష్టించారన్న ప్రచారం కూడా జరిగింది.

ఈ విషయాన్ని కలెక్టర్ దాదాపు మూడు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ దృష్టికి మౌఖికంగా తీసుకెళ్లినట్లు తమిళ మీడియా వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా ఈ విషయం వెళ్లడంతో అరుళ్ విగ్నేష్‌ను మందలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ వ్యవహారం మద్రాస్ హైకోర్టు గడప తొక్కింది. న్యాయవాది ఆర్. త్రిశూలి దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ విచారణ చేపట్టారు. సోమవారం జరిగిన విచారణలో ప్రభుత్వ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. జాన్ సత్యన్ వాదనలు వినిపిస్తూ కలెక్టర్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసులకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు, కలెక్టర్ స్వయంగా ఫిర్యాదు చేశారా లేదా అన్నది స్పష్టం చేయాలని ఆదేశించింది.

దీంతో కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అదే రోజు మధ్యాహ్నం కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ పద్మజ నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఎమ్మెల్యే అరుళ్ విగ్నేష్‌పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఫిర్యాదుతో కళ్లకురిచ్చి పోలీసులు ఎమ్మెల్యేపై మహిళా వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు మద్రాస్ హైకోర్టుకు కూడా నివేదించగా, మరోవైపు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో ఆయన అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరందుకుంది. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది.

తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే అరుళ్ విగ్నేష్ పూర్తిగా ఖండించారు. ప్రభుత్వ అధికారులంటే తనకు ఎంతో గౌరవం ఉందని, కళ్లకురిచ్చి ప్రాంతంలో తాను ఒక్కడినే టీవీకే ఎమ్మెల్యేగా గెలవడంతో రాజకీయ కక్షతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాగుబోతులా కలెక్టర్ నివాసానికి వెళ్లానన్న ఆరోపణలను తోసిపుచ్చుతూ, అవసరమైతే రక్త పరీక్షలకు కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు.

కలెక్టర్ అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతిపక్షాలకు బలమైన అస్త్రం దొరికినట్లయిందని అంటున్నారు. జిల్లా కలెక్టర్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, రాష్ట్రంలోని సాధారణ మహిళల భద్రత ఏమిటి?" అని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ నిలదీశారు. విషయం తెలిసిన వెంటనే సీఎం, సీఎస్ స్పందించి అధికారిణికి అండగా నిలబడాల్సింది పోయి, సొంత పార్టీ ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. మరోవైపు, ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేసి, పార్టీ నుంచి, అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు, ఆమె కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. అధికార కూటమిలో ఉన్న కాంగ్రెస్, సీపీఐ(ఎం), వీసీకే వంటి మిత్రపక్షాలు సైతం చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజయ్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం సీఎం విజయ్‌కు పెద్ద మచ్చగా మారే ప్రమాదం ఉంది. తొలిసారి ముఖ్యమంత్రి కావడంతో ఈ సున్నితమైన అంశాన్ని మొదటి నుంచే కఠినంగా డీల్ చేయడంలో విజయ్ కొంత తటపటాయించారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. "మార్పు తీసుకొస్తాం.. మహిళలకు రక్షణ కల్పిస్తాం" అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన విజయ్, ఇప్పుడు తన మాటపై నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. వివాదం ఇంత దూరం వచ్చాక కూడా ఉపేక్షిస్తే, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినడంతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అదుపు తప్పే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    
  • actorvijay 
  • tvk 
  • tamilnadupolitics 
  • arulvignesh 

Similar News

బొత్స వర్సెస్ చిన్న శ్రీను.. చీపురుపల్లిలో డైరెక్ట్ ఫైట్

2026-11-24 08:43 GMT

ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...రాహుల్ నజర్

2026-11-24 08:33 GMT

పూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవం.. వీడియో వైరల్!

2026-11-24 08:31 GMT

బీజేపీలో మోడీ స్వామ్యం...రాష్ట్రాలలో పార్టీ బలహీనం

2026-11-24 08:29 GMT

ఎన్విడియా ఆఫీసులో జెన్సన్ హువాంగ్‌ రీ ఎంట్రీ.. ఉద్యోగుల గ్రాండ్ వెల్కమ్.. ఆ భావోద్వేగ క్షణాలు వైరల్

2026-11-24 08:24 GMT

షేక్ హసీనా... చావుకు ఎదురెళ్తున్నారా ?

2026-11-24 08:24 GMT

ఆస్తుల ప్రదర్శనతో చిక్కులు.. గోల్డ్ మ్యాన్ యాదగిరికి ఐటీ షాక్

2026-11-24 08:09 GMT

భారత పాస్‌పోర్టుకు షాక్.. వీసా లేకుండా వెళ్లే దేశాలు తగ్గాయ్!

2026-11-24 06:30 GMT

యుద్ధం అంటే వినాశనమే.. రాలిపోయిన 7 లక్షల రష్యన్ల ప్రాణాల కన్నీటి కథ

2026-11-24 05:43 GMT

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!

2026-11-24 05:42 GMT

ఒకప్పుడు మూసేసిన బ్రాండ్‌నే మళ్లీ తెస్తున్న కోకాకోలా.. గోల్డ్ స్పాట్ కథ తెలుసా?

2026-11-24 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS