• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్విడియా ఆఫీసులో జెన్సన్...

ఎన్విడియా ఆఫీసులో జెన్సన్ హువాంగ్‌ రీ ఎంట్రీ.. ఉద్యోగుల గ్రాండ్ వెల్కమ్.. ఆ భావోద్వేగ క్షణాలు వైరల్

| ఎన్విడియా కార్యాలయానికి తిరిగి వచ్చిన సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు ఉద్యోగులు చప్పట్లు, కేరింతలతో స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనపై వ్యక్తిగత వివాదాలు, రాజీనామా, తిరిగి నియామకం అంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ స్వాగతం చర్చనీయాంశమైంది.

By - A.N.Kumar
Update: 2026-11-24 08:24 GMT

సాధారణంగా కార్పొరేట్ ప్రపంచం అంటేనే గంభీరమైన సమావేశాలు.. లక్ష్యాలు.. అంకెల గారడీ గుర్తుకొస్తాయి. అక్కడ బాస్‌కు.. ఉద్యోగులకు మధ్య ఒక కనిపించని గీత ఉంటుంది. కానీ ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా కార్యాలయంలో ఆ గీత చెరిగిపోయింది. అక్కడ కనిపించింది ఒక సీఈఓ.. ఆయన కింద పనిచేసే సిబ్బంది కాదు.. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కుటుంబ పెద్ద ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కలిగే ఆనందం.. ఆత్మీయత..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఆఫీసులోకి అడుగుపెడుతున్న వీడియోనే చక్కర్లు కొడుతోంది. ఈసారి ఆయన ఏ కొత్త ఏఐ చిప్‌ను ఆవిష్కరించలేదు.. బిలియన్ డాలర్ల పెట్టుబడుల గురించి ప్రకటించలేదు. కేవలం తన కార్యాలయానికి తిరిగి వచ్చారంతే.. కానీ ఆ ఒక్క క్షణం ఎన్విడియా ప్రాంగణాన్ని భావోద్వేగంతో నింపేసింది.

ఎప్పటిలాగే తనదైన సిగ్నేచర్ స్టైల్‌లో జెన్సన్ హువాంగ్ కార్యాలయంలోకి అడుగుపెట్టగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చాలా రోజుల తర్వాత తమ ప్రియమైన నాయకుడిని చూసిన ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెల్‌కమ్ బ్యాక్ జెన్సన్ అంటూ ఉద్యోగులంతా ఒక్కసారిగా నినాదాలు చేస్తూ చప్పట్లు, కేరింతలతో ఆఫీసును హోరెత్తించారు. తమ బాస్ చుట్టూ చేరి ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉద్యోగుల నుండి వచ్చిన ఈ ఊహించని అపూర్వ స్పందనకు హువాంగ్ సైతం కదిలిపోయారు. తనదైన ఆత్మీయ చిరునవ్వుతో అందరికీ అభివాదం చేస్తూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఒక కార్పొరేట్ దిగ్గజం కార్యాలయంలో ఇలాంటి హృద్యమైన దృశ్యాలు కనిపించడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

గత కొద్దిరోజులుగా జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు.. ఊహాగానాలు వినిపించాయి. నవంబర్ 12న ఆయన రాజీనామా చేయడం.. వ్యక్తిగత అంశాల నేపథ్యంలో ఆయన తన కుటుంబానికి సహోద్యోగులకు క్షమాపణలు చెప్పడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా కొన్ని అంశాలపై స్వతంత్ర దర్యాప్తు జరుగుతోందన్న వార్తలు కూడా వినిపించాయి.

రాజీనామా తర్వాత ఎన్విడియా షేర్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ సహా పారిశ్రామిక కంపెనీల దిగ్గజాలు సైతం జెన్సాన్ ను తిరిగి ఎన్వీడియో సీఈవోగా నియమించాలని.. అతడే సరైన వాడు అంటూ గళమెత్తారు. దీంతో బోర్డు కూడా మళ్లీ జెన్సాన్ నే నియమించింది. ఆ ఉత్కంఠభరిత వాతావరణం తర్వాత హువాంగ్ తిరిగి విధుల్లోకి రావడం.. ఆ సమయంలో ఉద్యోగులు ఆయనకు అండగా నిలుస్తూ ఇంతటి ఘన స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒక సంస్థ శిఖరాగ్రానికి చేరాలంటే కేవలం అద్భుతమైన టెక్నాలజీ.. కోట్ల రూపాయల పెట్టుబడులు ఉంటే సరిపోదు. ఆ సంస్థను నడిపించే నాయకుడికి.. అందులో పనిచేసే ప్రతి ఒక్కరికీ మధ్య ఒక బలమైన భావోద్వేగ బంధం ఉండాలి. కష్టకాలంలోనూ.. వివాదాల నడుమ కూడా ఉద్యోగులు తమ నాయకుడి రాకను ఇంతలా సంబరంగా జరుపుకోవడం అరుదైన విషయం. ఇది కేవలం ఒక అధికారిక స్వాగతం కాదు.. తమ నాయకుడిపై ఉద్యోగులకు ఉన్న నమ్మకానికి.. గౌరవానికి ప్రతీక అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బయట ప్రపంచంలో ఎన్ని చర్చలు.. వివాదాలు నడుస్తున్నా.. ఎన్విడియా నాలుగు గోడల మధ్య వినిపించిన ఆ చప్పట్ల శబ్దం.. జెన్సన్ హువాంగ్ ముఖంలో కనిపించిన ఆ నిష్కల్మషమైన చిరునవ్వు మాత్రం ఒక గొప్ప అనుబంధానికి సాక్ష్యంగా నిలిచాయి. టెక్ ప్రపంచంలో ఈ వీడియో కేవలం ఒక వైరల్ క్లిప్‌గా మాత్రమే కాదు.. నాయకత్వ విలువలకు ఒక అందమైన ఉదాహరణగా మిగిలిపోనుంది.


Scenes from Nvidia headquarters as Jensen comes back. The Nvidia employees wanted him back more than anything. Grateful to the President, everyone in the administration, everyone who signed the petition, everyone who supported Jensen publicly, everyone who called the board, everyone on the board who fought for him, everyone. This is why America is the greatest country on earth. Every part of Jensen’s story would have only been possible in America. And remember that Gandalf the White was even better than Gandalf the Grey in every way. “Let’s get to work.” 🇺🇸

— Gavin Baker (@GavinSBaker) November 23, 2026
Tags:    
  • jensenhuang 
  • nvidia 
  • nvidiaceo 
  • technews 

Similar News

ఏపీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...రాహుల్ నజర్

2026-11-24 08:33 GMT

పూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవం.. వీడియో వైరల్!

2026-11-24 08:31 GMT

బీజేపీలో మోడీ స్వామ్యం...రాష్ట్రాలలో పార్టీ బలహీనం

2026-11-24 08:29 GMT

షేక్ హసీనా... చావుకు ఎదురెళ్తున్నారా ?

2026-11-24 08:24 GMT

ఆస్తుల ప్రదర్శనతో చిక్కులు.. గోల్డ్ మ్యాన్ యాదగిరికి ఐటీ షాక్

2026-11-24 08:09 GMT

భారత పాస్‌పోర్టుకు షాక్.. వీసా లేకుండా వెళ్లే దేశాలు తగ్గాయ్!

2026-11-24 06:30 GMT

యుద్ధం అంటే వినాశనమే.. రాలిపోయిన 7 లక్షల రష్యన్ల ప్రాణాల కన్నీటి కథ

2026-11-24 05:43 GMT

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయుడి మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు!

2026-11-24 05:42 GMT

ఒకప్పుడు మూసేసిన బ్రాండ్‌నే మళ్లీ తెస్తున్న కోకాకోలా.. గోల్డ్ స్పాట్ కథ తెలుసా?

2026-11-24 04:18 GMT

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం

2026-11-24 03:46 GMT

Copyright @2026

Powered by Blink CMS