• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Tamil Nadu >  త్రిష మరో జయలలిత...పోలిక...

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

| నటి త్రిష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మరోసారి మొదలైంది. తమిళనాడులోని తిరునెల్వేలిలో అభిమానులు ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేలో త్రిష చురుకైన పాత్ర పోషించాలని కోరుతున్నారు. అయితే త్రిషకు రాజకీయ ప్రవేశంపై ఆసక్తి లేదని గతంలో ఆమె న్యాయ ప్రతినిధులు స్పష్టం చేశారు.

By - Satya P
Update: 2026-11-24 03:46 GMT

రెండు దశాబ్దాలకు పైగా సినీ జీవితం నటి త్రిషది. ఆమె దక్షిణాది భాషలలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించి ఎంతో పేరు సంపాదించారు. అయితే ఆమె ఇపుడు రాజకీయ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. నిజానికి ఈ చర్చ ఇప్పటిది కాదు, తమిళనాడులో టీవీకే పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి సాగుతూనే ఉంది. ఇక విజయ్ తన ఒకనాటి సహనటి త్రిషతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో కూడా ఆమె టీవీకేలో చేరి తన వంతు పాత్ర పోషిస్తారు అని ఎవరికి తోచిన తీరున వారు ఊహాగానాలు వ్యాప్తి చేశారు. అయితే ఇంతకీ త్రిషకు ఆ ఆలోచన ఉందా లేదా టీవీకే అధినాయకత్వం ఆమెని ప్రోత్సహిస్తుందా అంటే ఇవన్నీ కూడా గాసిప్స్ గానే ఇప్పటికీ చూస్తున్న వారే ఉన్నారు.

ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై :

అంటే తెలుగులో దీనికి అర్థం యువ విప్లవ నాయకురాలు త్రిష ఫోరమ్ అని. దీనిని త్రిష అభిమానులు అమెకు మద్దతుగా నిలిచే వారు తాజాగా తమిళనాడులోని తిరునెల్వేలిలో త్రిష అభిమానులు, మద్దతుదారులు ఒక కొత్త సంస్థను ప్రారంభించారు. అయితే ఈ పేరుతోనే రాజకీయ వాసనలతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత బిరుదు కూడా గుర్తుకు వచ్చే విధంగా ఉండడం తోనే అధిక చర్చకు తావిస్తోంది. జయలలితకు ఉన్న పురట్చి తలైవి బిరుదును స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు త్రిషకు ఈ పేరు పెట్టారని అంటున్నారు. అంతే కాదు త్రిషలో కూడా జయలలిత మాదిరిగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అందువల్ల ఆమె ప్రజాసేవలోకి రావాలని ఈ సంస్థ సమన్వయకర్త రాజగోపాల్ గట్టిగా కోరుతున్నారు.

టీవీకేతో పనిచేయాలని :

ఈ సంస్థ నిర్వాహకులు అంతటితో ఆగడం లేదు త్రిష ఇక మీదట నుంచి టీవీకేలో చురుకైన పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి ప్రజా సేవ చేయాలని కూడా తమ కోరికగా ఒక ప్రకటన విడుదల చేసి మరీ అభిమానులు చెబుతున్నారు. ఇక గతంలో చూసుకుంటే విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి త్రిష హాజరవ్వడం జరిగింది. దాంతో ఆమె రాజకీయ ప్రవేశం గురించి నాటి నుంచే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. త్రిష త్వరలోనే టీవీకే పార్టీలో చేరవచ్చనే ప్రచారం కూడా మరో వైపు సాగుతోంది.

త్రిష అనుమతి ఉందా :

ఇంతకీ అభిమానులు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి ఉందా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే త్రిష ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం కలిగి లేరని అసలు ఆమెకు రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదని గతంలో ఆమె న్యాయ ప్రతినిధులు ఒక సందర్భంలో స్పష్టం చేశారు. అవన్నీ పక్కన పెడితే ఇపుడు ఏకంగా ఒక సంస్థనే ఏర్పాటు చేసి అభిమానులు చేస్తున్న హడావుడి మీద తాజా పరిణామాలపైన త్రిష ఏ విధంగా స్పందిస్తారు అన్నదే అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    
  • trisha 
  • vijay 
  • tvk 
  • tamilnadupolitics 
  • trishapoliticalentry 

Similar News

జయలలిత బాటలో త్రిష.. సీఎం విజయ్ కు షాకేనా? అసలు వ్యూహమేంటి?

2026-11-23 17:00 GMT

స్టాలిన్ రిస్క్ చేస్తారా...ఊరిస్తున్న కొళత్తూరు

2026-11-22 04:16 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజీవ్ కి ద్రోహం చేశానా...సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-12 02:16 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS