• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Tamil Nadu >  స్టాలిన్ రిస్క్...

స్టాలిన్ రిస్క్ చేస్తారా...ఊరిస్తున్న కొళత్తూరు

| తమిళనాడులో కొళత్తూరు ఉప ఎన్నిక స్టాలిన్‌కు కీలక రాజకీయ సవాల్‌గా మారింది. 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో 8,795 ఓట్లతో ఓడిన స్టాలిన్‌కు ఇప్పుడు అదే స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే బాబు మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో టీవీకేకు సానుభూతి, అధికార బలం ఉండటంతో స్టాలిన్ పోటీపై డీఎంకేలో చర్చ జరుగుతోంది.

By - Satya P
Update: 2026-11-22 04:16 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ కి ఇపుడు అతి పెద్ద రాజకీయ సవాల్ గా కొళత్తూరు అసెంబ్లీ సీటు ఉంది. ఆరు నెలలు తిరగకుండానే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. నిజానికి ఇది స్టాలిన్ కి గోల్డెన్ చాన్స్ అని చెప్పాలి. ఆయన మాజీ సీఎం గానే కాదు మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దాంతో ఆయన అసెంబ్లీలో కనిపించకపోవడంతో డీఎంకే పూర్తిగా డీలా పడింది. కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలా విజయ్ వర్సెస్ ఉదయనిధిగా రాజకీయం కూడా స్టాలిన్ వారసుడి భవిష్యత్తుకు మంచిదే. అయితే స్టాలిన్ అసెంబ్లీలో ఉంటే ఆ ఇమేజ్ వేరు అన్నది కూడా ఉంది. మరి స్టాలిన్ కి వచ్చిన ఈ అవకాశాన్ని ఆయన వాడుకుంటారా లేదా అన్నదే చర్చగా ఉంది.

మరణంతో ఉప ఎన్నిక :

నిజానికి కొళత్తూరు అసెంబ్లీకి ఆరు నెలల క్రితం టీవీకే తరఫున పోటీ చేసి ఏకంగా ఆనాటి సీఎం గా ఉన్న స్టాలిన్ ని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్న వీఎస్ బాబు అనూహ్యంగా మరణించారు. ఆయన మృతితో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇక వీఎస్ బాబు గురించి చూస్తే ఆయన మొదట్లో డీఎంకే లోనే ఉండేవారు. ఉత్తర చెన్నై ప్రాంతంలో బలమైన స్థానిక నేతగా ఎదిగిన ఆయన, డీఎంకే నుంచి అన్నాడీఎంకేకు ఆ తర్వాత నటుడు విజయ్ స్థాపించిన టీవీకేలోకి వచ్చి చేరారు. డీఎంకే తరఫున 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పురసవాకం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా పోటీ చేసి, అస్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించారు.

పార్టీలో ఒత్తిడి :

ఈ నేపధ్యంలో ఖాళీ అయిన కొళత్తూరు అసెంబ్లీ నుంచి ఉప ఎన్నికల్లో స్టాలిన్ పోటీ చేయాలని పార్టీ నుంచి స్టాలి నుంచి స్టాలిన్ మీద ఒత్తిడి వస్తోంది. ఆయనే అధినేత కాబట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో వైపు చూస్తే వీఎస్ బాబు కుటుంబానికి టీవీకే టికెట్ ఇస్తుందని ప్రచారంలో ఉంది. అక్కడ వీఎస్ బాబుకి సొంత బలం ఉంది. అధికారంలో టీవీకే ఉంది. దాంతో అన్ని రకాలైన అండదండలతో టీవీకే కచ్చితంగా గెలుపుని సాధించేందుకు ప్రయత్నిస్తుందని అంటున్నారు. అటు వీఎస్ బాబు పట్ల జనంలో సానుభూతి ఇటు టీవీకే అధికార బలం వెరసి కొళత్తూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చు అన్నది కూడా ఉంది.

రిస్క్ గానే అంటూ :

ఇక్కడే స్టాలిన్ తన రాజకీయ చతురతను చూపించాల్సి ఉంది అని అంటున్నారు. కొళత్తూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఎంత అవకాశమో అంతకు మించిన రిస్క్ అని కూడా అంటున్నారు. టీవీకే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు మాత్రమే అయింది. ఇంకా ప్రజలకు మోజు అలాగే ఉంది. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో అన్నా డీఎంకే కంచుకోటలను బద్ధలు కొట్టి టీవీకే గెలిచింది. అసెంబ్లీలో ఇంకా పూర్తి మెజారిటీ లేదు, దాంతో ప్రతీ సీటూ ప్రాణ ప్రదమే కాబట్టి టీవీకే సర్వ శక్తూ ఒడ్డుతుందని అంటున్నారు. దాంతో పాటుగా డీఎంకే నిన్నటిదాకా అధికారంలో ఉంది. జనంలో ఆ పార్టీ పట్ల మొగ్గు ఇంతలోనే వచ్చేది పెద్దగా ఏమి ఉంటుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. స్టాలిన్ కనుక బరిలోకి దిగితే సీఎం విజయ్ ప్రతిష్ట గా భావించి అక్కడే మకాం వేసి అయినా టీవీకే అభ్యర్ధిని గెలిపించుకుంటారు. అలా జరిగితే రెండోసారి వరసగా ఓడి ఇక రాజకీయంగా కూడా స్టాలిన్ కోలుకోలేని దెబ్బ తింటారని అంటున్నారు. కేవలం ఆయనకే కాదు డీఎంకేకు కూడా మరింతగా రాజకీయ ఇబ్బందిని తెచ్చిపెడుతుంది.

వ్యూహాత్మకంగానే :

స్టాలిన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తారు అని అంటున్నారు. న్యాయ ప్రకారం అది టీవీకే సిట్టింగ్ సీటు. పైగా గట్టిగా ఆరు నెలలు తిరగకుండానే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే మరణించారు. దాంతో జనాలు ఆ పార్టీకే ఓటు వేయవచ్చు. టీవీకే ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత కూడా ఏమీ లేదు, అందుకే స్టాలిన్ తమ పార్టీ తరఫున వేరే అభ్యర్ధిని పోటీకి పెట్టవచ్చు అన్నది అయితే గట్టిగా వినిపిస్తోంది. ఇంత కష్టపడి పోటీ చేసి ఒకవేళ స్టాలిన్ గెలిచినా సీఎం సీటు అయితే దక్కదు, తన కుమారుడి విపక్ష కుర్చీకే అది ఎసరు పెట్టినట్లు అవుతుంది. ఎటూ భవిష్యత్తు రాజకీయం అంతా ఉదయనిధిదే కాబట్టి విజయ్ కి పోటీగా ఆయననే అసెంబ్లీలో కొనసాగించడమే మేలు అన్నది కూడా ఉంది అంటున్నారు.

Tags:    
  • mkstalin 
  • kolathurbyelection 
  • tamilnadupolitics 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

కొబ్బరికాయ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు.. దీని కథేంటి తెలుసా?

2026-11-17 17:33 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

హైటెక్ దొంగతనం.. కొత్త జ్యువెలరీ షోరూమ్‌ను టార్గెట్ చేసిన యూట్యూబర్!

2026-11-15 19:28 GMT

విజయ్ మామ గిఫ్ట్.. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్! దళపతి మాస్టర్ మైండ్ ఇదేనా?

2026-11-13 04:43 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజీవ్ కి ద్రోహం చేశానా...సోనియా షాకింగ్ కామెంట్స్ !

2026-11-12 02:16 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

మాజీ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆరాటం.. ఆర్టీఐతో పోరాటం..ఇదో సాధారణ బ్రేకప్ స్టోరీ కాదు సామీ

2026-11-07 14:05 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS