• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మళ్లీ.. మళ్లీ.. కొల్లుకే...

మళ్లీ.. మళ్లీ.. కొల్లుకే ఎందుకిలా జరుగుతోంది?

| రెండోసారి మంత్రి అయిన కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు సముచిత ప్రాధాన్యమిచ్చారు. గత ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయనకు జిల్లాలో పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 08:39 GMT

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి మనస్తాపానికి గురయ్యారు. తనను ముఖ్య అతిథిగా పిలిచిన ఓ కార్యక్రమానికి ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని ఆహ్వానించడం, తనతో సమానంగా ఆయనకు వేదికపై కూర్చోబెట్టాలని భావించడంతో మంత్రి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన అసంతృప్తిని నిర్వాహకులకు తెలియజేసి కార్యక్రమానికి హాజరుకాకుండా ఉండిపోయారు. దీంతో ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే మంత్రి కొల్లును బాధపెట్టారని కార్యక్రమ నిర్వాహకులైన టీడీపీ నేతలపై కార్యకర్తలు, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండోసారి మంత్రి అయిన కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు సముచిత ప్రాధాన్యమిచ్చారు. గత ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయనకు జిల్లాలో పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. అయితే అధికారులు, పార్టీలో ఇతర నేతలు మాత్రం మంత్రి అధిష్టానికి వ్యతరేకంగా పనిచేస్తున్నారని ఇటీవల సంఘటనలు తెలియజేస్తున్నాయి. ముందుగా మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పేర్ని నాని ఇష్యూలో మంత్రి కొల్లు మాట చెల్లలేదని ప్రచారం జరిగింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పేర్ని కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంలో పేర్ని కుటుంబంలోని మహిళలను అరెస్టు చేయాల్సిందిగా మంత్రి ఒత్తిడి చేశారని, అందుకు చంద్రబాబు అంగీకరించలేదని ఉమ్మాడి జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు తనకు చెప్పారని మాజీ మంత్రి పేర్ని చెప్పారు. ఇది మంత్రి కొల్లుకు ప్రభుత్వంలో పరపతి లేనట్లుగా వైసీపీ ప్రచారం చేసింది. దీనికి నొచ్చుకున్న మంత్రి పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పడమేంటని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఈ విషయం సర్దుమణిగిందనగా, తాజాగా మరో సంఘటన మంత్రిని తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెబుతున్నారు. 29వ తేదీన విజయవాడలో రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇదే కార్యక్రమానికి క్రిష్ణా జిల్లా మాజీ ఎస్పీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ బాబును కూడా అతిథిగా ఆహ్వానించారు. రవీంద్రనాథ్ బాబు ఎస్పీగా ఉండగానే కొల్లుపై హత్య కేసు నమోదు చేశారు. ఆయనను జైలుకు పంపారు. తనపై అక్రమంగా కేసు పెట్టిన ఎస్పీని తనతో వేదిక పంచుకునేలా ఎలా ఆహ్వానిస్తారనే ఆగ్రహంతో మంత్రి ఆ కార్యక్రమానికి వెళ్లకుండా గైర్హాజరయ్యారు. ఈ విషయం తెలిసో తెలియకో నిర్వాహకులు పుండు మీద కారం జల్లినట్లు కార్యక్రమం అంతా రవీంద్రనాథ్ బాబును వేదికపై పిలిచి కూర్చొబెట్టారు. దీంతో మంత్రి కొల్లు తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు.

తనకు జరిగిన అవమానాన్ని ఆయన మనసులో దాచుకోకుండా తన బాధను బయటకు వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను వేధించిన వ్యక్తిని పార్టీ కార్యక్రమానికి ఎలా ఆహ్వానిస్తారని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆవేదనను తెలుసుకున్న టీడీపీ అనుబంధ సంఘమైన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ నేతలు సమావేశయ్యారు. టీటీడీ సభ్యుడు శాంతారాంతో కలిసి మంత్రితో మాట్లాడారు. తిరుపతికి చెందిన రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు సదాశివం తన సొంత ఆలోచనతో రవీంద్రనాథ్ బాబుని పిలిచారని వివరణ ఇచ్చారు. పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానించమని ఎవరూ చెప్పలేదని తెలిపారు. ఇకపై ఇలాంటి తప్పులు జరగనివ్వమని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Tags:    
  • Kolluravindra 
  • Apminister 
  • Andhrapradesh 
  • TeluguPolitics 
  • MinisterHumiliation 
  • EventControversy 
  • TDPPolitics 
  • PoliticalTensions 
  • TeluguNews 
  • Chandrababu 
  • Perninani 

Similar News

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS