టెక్ ప్రపంచంలో సంచలనం: AI గ్లాసెస్ వల్ల ప్రమాదంలో ప్రైవసీ? మెటాకు షాక్

టెక్నాలజీ మన జీవితాలను ఈజీ చేస్తోంది అనుకుంటే, అదే టెక్నాలజీ ఇప్పుడు మన బెడ్‌రూమ్ వరకు వచ్చేసిందా? మెటా కంపెనీ తీసుకొచ్చిన AI స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాయి.;

Update: 2026-03-18 12:30 GMT

టెక్నాలజీ మన జీవితాలను ఈజీ చేస్తోంది అనుకుంటే, అదే టెక్నాలజీ ఇప్పుడు మన బెడ్‌రూమ్ వరకు వచ్చేసిందా? మెటా కంపెనీ తీసుకొచ్చిన AI స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాయి. యూజర్ల ప్రైవసీకి రక్షణ లేకుండా, వారి పర్సనల్ వీడియోలు విదేశీ రివ్యూయర్ల చేతికి వెళ్తున్నాయనే వార్త టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. అసలు ఈ స్మార్ట్ గ్లాసెస్ వల్ల ముంచుకొస్తున్న ముప్పు ఏంటి? మెటా సంస్థ ఎదుర్కొంటున్న ఆరోపణలేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

ఏమిటీ మెటా AI గ్లాసెస్ గోల?:

మెటా సంస్థ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను డిజైన్ చేసింది. కేవలం కళ్ళజోడు పెట్టుకుని ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, ఇన్ఫర్మేషన్ అడగడం వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అయితే, స్వీడిష్ పత్రికల ఇన్వెస్టిగేషన్‌లో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఈ గ్లాసెస్ ద్వారా రికార్డ్ అయిన యూజర్ల అత్యంత వ్యక్తిగత దృశ్యాలు కెన్యాలోని రివ్యూయర్లకు చేరుతున్నాయట. అంటే మనకు తెలియకుండానే మన డేటా సముద్రాలు దాటి వెళ్ళిపోతోంది.

బెడ్‌రూమ్ నుంచి బ్యాంక్ కార్డుల వరకు:

ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. యూజర్లు తమ ఇళ్లలో ఉన్నప్పుడు, అంటే బాత్‌రూమ్, బెడ్‌రూమ్ వంటి ప్రైవేట్ ప్లేసెస్‌లో ఉన్న దృశ్యాలు కూడా రికార్డ్ అవుతున్నాయి. ఇక అంతటితో ఆగకుండా, యూజర్లు వాడే బ్యాంక్ కార్డులు, సీక్రెట్ పిన్ నంబర్ల వివరాలు కూడా ఈ గ్లాసెస్ ద్వారా రికార్డ్ అయి థర్డ్ పార్టీ సిబ్బందికి చేరుతున్నాయి. సాధారణంగా ఇలాంటి డేటాను పంపేటప్పుడు ముఖాలు 'బ్లర్' చేయాలి. కానీ ఆ టెక్నాలజీ సరిగ్గా పనిచేయకపోవడంతో వ్యక్తుల ఫేస్ లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయట.

రివ్యూయర్ల చేతిలో మన ప్రైవసీ:

AI సిస్టమ్‌ను మెరుగుపరచడం కోసం ఈ వీడియోలను కెన్యా లాంటి దేశాల్లోని రివ్యూయర్లకు మెటా పంపిస్తోందని సమాచారం. అక్కడ ఉండే సిబ్బంది ఈ వీడియోలను చూసి AI ఎలా పనిచేస్తుందో అనలైజ్ చేస్తారు. కానీ, ఇలాంటి పర్సనల్ వీడియోలు వేరే దేశంలోని వ్యక్తులు చూడటం అనేది ప్రైవసీకి గొడ్డలిపెట్టు లాంటిది. ఇక దీంతో బాధితులు మెటా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'క్లాస్ యాక్షన్' దావా వేశారు. ఇది మెటాకు పెద్ద ఇంటర్నేషనల్ షాక్ అనే చెప్పాలి.

టెక్నాలజీతో జాగ్రత్త!:

మనం వాడే ప్రతి గ్యాడ్జెట్ మనకు స్నేహితుడు మాత్రమే కాదు, ఒక్కోసారి వేగులా కూడా మారే ఛాన్స్ ఉంది. మెటా AI గ్లాసెస్ విషయంలో జరిగిన ఈ లీకేజీ అందరికీ ఒక పెద్ద గుణపాఠం. ఇక కంపెనీలు ఎన్ని భరోసాలు ఇచ్చినా, AI పేరుతో మన ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఈ ఉదంతం నిరూపించింది. అందుకే స్మార్ట్ గ్లాసెస్ లాంటి గ్యాడ్జెట్స్ వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.

Tags:    

Similar News