• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాహుల్ కాన్ఫిడెన్స్ వేరే...

రాహుల్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ... సర్వేలకు అందనిది !

| గత రెండేళ్లుగా రాహుల్ గాంధీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుస పరాజయాలు ఎదురైనా ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గడం లేదు. రాహుల్ విమర్శలకు బీజేపీ అగ్రనేతలు తరచూ స్పందించడమే తన బలం పెరిగిందనడానికి సంకేతమని కాంగ్రెస్ భావిస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఆయన ప్రభావాన్ని తేల్చనున్నాయి.

By - Satya P
Update: 2026-11-23 03:56 GMT

కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాజకీయ దూకుడు మామూలుగా అయితే లేదు. ఆయన గత రెండేళ్ళుగా యమ జోరు చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ విధానాలను ఎండగడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని సైతం డిబేట్లకు తనతో రావాలని సవాల్ చేస్తున్నారు. అమిత్ షా తో పాటు ఆర్ఎస్ఎస్ ని కూడా కలిపి మరీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇంతకీ రాహుల్ లో పెరిగిన ఈ కాన్ఫిడెన్స్ కి కారణాలు ఏమిటి, ప్రజలలో ఆదరణ పెరిగిందని నివేదికలు చూసి ఇలా స్పీడ్ పెంచుతున్నారా లేక బీజేపీ కళ్ళల్లోకి చూసి మరీ తనకు ఎదురు లేదని భావిస్తున్నారా అన్నది అయితే చర్చనీయాంశంగా ఉంది.

విజయాలు లేవు కానీ :

ఇక చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల తరువాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ దాని మిత్ర పక్షాలే గెలుస్తూ వచ్చాయి. కాంగ్రెస్ ని అపజయాలే పలకరించాయి. ఎంతో ప్రతిష్టగా తీసుకున్న కీలక రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి. అయితే 2026 లో మాత్రం కొంత ఊరట కలిగింది. దక్షిణ భారత దేశంలో కేరళ కాంగ్రెస్ సొంతం అయింది. అలాగే తమిళనాడు ప్రభుత్వంలో టీవీకేతో భాగస్వామ్యం దక్కింది. అయితే ఈ రెండూ బీజేపీ ఖాతాలో లేవు. మరి బీజేపీ నుంచి గెలుచుకున్న రాష్ట్రం ఒక్కటి ఉంటే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినట్లుగా భావించాలి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో అది జరుగుతుందో లేదో చూడాలి కానీ రాహుల్ తీరు చూస్తే అపుడే 2029 ఎన్నికల్లో గెలిచేసినంతగా హడావుడి చేస్తున్నారు. పూర్తి ధీమా ప్రదర్శిస్తున్నారు. మరి ఎందుకిలా అంటే అక్కడే రాజకీయ తమాషా ఉంది అంటున్నారు.

ఏ సర్వేలు చెప్పనివి :

రాజకీయాల్లో సర్వేలు అన్నవి సాంకేతికంగా కొంత వరకూ జనాభిప్రాయాన్ని కొలిచి పెట్టగలవేమో. కానీ రాజకీయం అన్నది నిరంతర స్రవంతి. అలా కనుక చూస్తే డే టూ డే పరిణామాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నింటినీ బేరీజు వేసుకుంటూ రాజకీయ పార్టీలు అయినా నేతలు అయినా ముందుకు సాగుతూ ఉంటారు. అలా వారికి వచ్చే నివేదికలు అంతర్గతంగా ఎన్నో ఉంటాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యర్ధి బలం ఎక్కడ చూడాలి అంటే అతని మాటలలో పోకడలలో అన్నది రాజకీయాల్లో అసలైన మూల సూత్రం. ప్రత్యర్ధిలో ధీమా సడలినపుడు అదే పనిగా విమర్శలు చేస్తారు. అంతే కాదు ఫుల్ ఫోకస్ ఇటు వైపే పెడతారు. అలాంటివి చూసినపుడు సహజంగానే అవతల పక్షం తమకు బలం కచ్చితంగా ఉందని భావనకు రావచ్చు.

ఇపుడు జాతీయ స్థాయిలో అదే జరుగుతోంది అని అంటున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడితే చాలు బీజేపీలో అనేక మంది నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. ఇక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మోడీ అమిత్ షాలు రెస్పాండ్ అవుతున్నారు. ఇవన్నీ రాహుల్ గ్రాఫ్ పెరిగింది అనడానికి సంకేతాలు కదా అన్నదే కాంగ్రెస్ మార్కు విశ్లేషణగా ఉంది. అవును ఊరకే ప్రత్యర్థుల మీద ఎవరూ ఫోకస్ పెట్టరు, వారికి బలం ఉందని తెలిస్తేనే వారిని టార్గెట్ చేస్తారు. అలా చూస్తే కనుక రాహుల్ కి తన బలం ఏమిటో బీజేపీ నేతల కళ్లలో చూస్తేనే కనిపిస్తోంది అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి రాహుల్ కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్ అన్నది అంతా ఇపుడు అంటున్న మాట. మరి అది కాంగ్రెస్ గ్రాఫ్ ని ఎంతగా పెంచుతుంది అన్నది వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు నిరూపిస్తాయని అంటున్నారు.

Tags:    
  • rahulgandhi 
  • congress 
  • bjp 
  • narendramodi 
  • indianpolitics 

Similar News

మార్కెట్లు పడిపోతుంటే డెమోక్రాట్లపై ట్రంప్ నిందలు.. అమెరికాలో కొత్త రాజకీయ రగడ!

2026-11-23 03:58 GMT

పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి.. టిలక్ వర్మ బ్యాటింగ్‌పై విమర్శలు!

2026-11-23 03:58 GMT

కీలక సమయాన తమ్మినేని సైలెంట్...రీజనేంటి ?

2026-11-23 03:58 GMT

విశాఖ రూపురేఖలు మార్చేసే అద్భుత కట్టడం !

2026-11-23 03:57 GMT

అట్రాక్షన్ లాగేస్తోంది.... బీచ్ మింగేస్తోంది !

2026-11-23 03:57 GMT

పెద్ద శ్రీనుని చేసిన వైసీపీ...పార్టీలో అంతర్మధనం !

2026-11-23 03:57 GMT

పుర పాలనకు శ్రీకారం...కొత్త ఏలికలకు శుభారంభం

2026-11-23 03:57 GMT

అటు అచ్చెన్న...ఇటు ధర్మాన...వెరీ ఇంట్రెస్టింగ్ !

2026-11-23 03:55 GMT

రియ‌ల్ ఎస్టేట్ లో భూకంపం.. బ్యాంకులు-బిల్డ‌ర్ల మిలాఖ‌త్‌: సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

2026-11-23 02:37 GMT

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల బెదిరింపు.. 26/11 తరహా దాడులకు కుట్ర?

2026-11-23 02:36 GMT

ఏపీలో రాష్ట్రపతి పాలన...అయ్యే పనేనా ?

2026-11-23 02:35 GMT

Copyright @2026

Powered by Blink CMS