ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు!

అవును... లోక్‌ సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్‌ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.

Update: 2024-05-02 08:48 GMT

దేశంలో సుమారు పాతిక సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం)ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ.. వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అనేకసార్లు పరీక్షించిన తర్వాతే వాటిని ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ సందేహాలు ముగియడంలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మమతా బెనర్జీ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు!

అవును... లోక్‌ సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్‌ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ లో మే - 1న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... తొలి రెండు దశల పోలింగ్‌ ముగిసినపుడు ఒక పోలింగ్ సంఖ్యను ప్రకటించిన అధికారులు.. ఆ తర్వాత ముందు ప్రకటించిన సంఖ్యకంటే ఏకంగా 5.75 శాతం పోలింగ్‌ పెరిగిందని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించడమేంటని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఇదే సమయంలో... బెంగాల్‌ లో బీజేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్‌ శాతం పెరిగిందని తెలిపారు.

ఈ విధంగా పోలింగ్‌ శాతం ఒక్కసారిగా గణనీయంగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... ఎన్నికల్లో గెలవడానికి భారతీయ జనతాపార్టీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కాగా... భారత్ లో పలుసందర్భాల్లో ఈవీఎం లపై సందేహాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే... యూరప్‌, ఉత్తర అమెరికాలోని దేశాలు మాత్రం ఈవీఎంలకు దూరంగా ఉంటున్నాయి. ఇదే సమయంలో... ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, అమెరికా తదితర దేశాలు పారదర్శకత లోపించిందని చెబుతూ ఈవీఎంలను నిషేధించడం గమనార్హం.

Tags:    

Similar News