గులాబీ బాస్ గా కేటీఆర్...తేల్చేసిన హరీష్
తాజాగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్స వేడుకలలో సైతం హరీష్ రావు ఫ్లెక్సీ కానీ పోటీ కానీ ప్రాంగణంలో లేదు. కానీ కేటీఆర్ ది పెద్దదిగా చూపించారు అంటే వారసుడు ఎవరో నాడే తేల్చేశారు అని అంటున్నారు.;
బీఆర్ఎస్ లో కేటీఆర్ ది పెత్తనం అని అందరికీ తెలుసు. ఆయన కేసీఆర్ కుమారుడు. ఇక పదేళ్ళ పాటు సాగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ హవా మామూలుగా సాగలేదు. ఆయనే వారసుడు అని అనేకసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చేశారు.
ఒకానొక దశలో కేసీఆర్ జాతీయ రాజకీయ రాజకీయాల్లోకి వెళ్ళి కుమారుడిని సీఎం గా చేయాలని అనుకున్నారు అని కూడా ప్రచారం సాగింది. అయితే ఏ కారణం చేతనో సీఎం గా కేటీఆర్ పట్టాభిషేకం ఆగింది. ఈలోగా ఎన్నికలు వచ్చిపడ్డాయి. బీఆర్ఎస్ ఓటమి పాలు అయింది.
నిజంగా ఎన్నికలలో బీఆ ఎస్ మూడవసారి గెలిస్తే కచ్చితంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అన్న సంగతి గులాబీ పార్టీలో అందరికీ తెలుసు. అయితే బీఆర్ ఎస్ లో కేటీఆర్ కి పోటీ ఎవరు అంటే ఠక్కున వచ్చే జవాబు హరీష్ రావు. ఆ మాటకు వస్తే హరీష్ రావుకే కేటీఆర్ పోటీగా వచ్చారు అని కూడా అంటారు.
ఎందుకంటే బీఆర్ఎస్ పూర్వ నామధేయం టీఆర్ ఎస్ గా పుట్టి పురుడుపోసుకున్నపుడు కేసీఆర్ పక్కన ఉన్నది హరీష్ రావు. అప్పటికి కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. అతి పెద్ద రిస్క్ చేశారు. సక్సెస్ ఏమిటో తెలియదు. దారి కూడా ఏమీ కనిపించని నేపథ్యం. అలాంటి సందర్భంలో మేనమామ వెంట ఉండి టీఆర్ఎస్ ని భుజాల మీద వేసుకున్నారు. ఉద్యమ పార్టీగా ఎన్నో ఒడుదుడుకులు పార్టీ ఎదుర్కొన్న వేళ అన్నింటినీ భరించి సహించారు.
ఇలా గులాబీ పార్టీకి బలమైన పిల్లర్ గా నిలబడ్డారు. ఆ తరువాత కేటీఆర్ కూడా వచ్చి చేరారు. ఇక ఇపుడు చూస్తే గత కొన్నాళ్ళుగా కేటీఆర్ ఆధిపత్యమే పెరిగిపోతోంది. తాజాగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్స వేడుకలలో సైతం హరీష్ రావు ఫ్లెక్సీ కానీ పోటీ కానీ ప్రాంగణంలో లేదు. కానీ కేటీఆర్ ది పెద్దదిగా చూపించారు అంటే వారసుడు ఎవరో నాడే తేల్చేశారు అని అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే బీఆర్ఎస్ లో హరీష్ రావు రగిలిపోతున్నారని ఆయన పార్టీ మార్చేస్తారు గులాబీ తోటలో తిరుగుబాటు అని ఇటీవల కాలంలో రకరకాలైన వార్తలు పుకారులుగా షికారు చేస్తున్నాయి. అయితే వాటిని ఒక్క మాటతో ఖండించేశారు హరీష్ రావు.
తనకు అసలైన బాస్ కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ మాటను తాను జవదాటను అన్నారు. తాను బీఆర్ ఎస్ నుంచి ఎక్కడికీ వెళ్ళేది లేదని కూడా స్పష్టం చేశారు. కేటీఆర్ ని బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసినా తాను పార్టీలో ఉంటాను స్వాగతిస్తాను అన్నారు. తనకు అంతిమ అధినేత కేసీఆర్ నే అని తేల్చేశారు.
దాంతో చాలా మందిలో మళ్ళీ కొత్త ఊహాగానలు చర్చలు మొదలయ్యాయి. కేటీఆర్ ని అధ్యక్షుడిగా చేస్తారా. ఆ ముహూర్తం దగ్గర పడిందా ఈ సమయంలో ఎందుకు హరీష్ రావు నోటి వెంట ఇలాంటి మాట వచ్చింది అన్నది అంతా అంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటున్నారు. గులాబీ పార్టీలో కేటీఆర్ కి బాధ్యతలు అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని అందుకే హరీష్ రావు నోటి వెంట ఈ విధంగా వచ్చింది అని అంటున్నారు.
ఇక చూస్తే గత ఏడాదిన్నరగా పార్టీ మొత్తాన్ని కేటీఆర్ కి అప్పగించి ఫాం హౌస్ లోనే కేసీఆర్ ఉంటున్నారు. దాంతో ఇపుడు సరైన సమయం చూసుకుని కేటీఅర్ కి అధ్యక్ష పదవి కట్టబెడతారా అన్నదే అంతా చర్చిస్తున్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు కానీ ఆయనే సర్వం అన్నట్లుగా గులాబీ పార్టీలో ఉంది.
హరీష్ రావు కూడా కేటీఆర్ కి ప్రమోషన్ ఇస్తే తాను కూడా జై కొడతాను అని స్పష్టంగా చెప్పేసిన నేపధ్యంలో గులాబీ పార్టీలో సంచలన పరిణామాలు ఏమైనా జరుగుతాయా అని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా హరీష్ రావు మీద ఇటీవల వస్తున్న పుకార్లు అన్నీ నిజాలు కావని ఆయన కేసీఆర్ కి అత్యంత విధేయుడు అని తాజాగా తన ప్రకటనలతో రుజువు చేసుకున్నారు అని అంటున్నారు.