రాజులంతా హ్యాపీసేనా ?
ఏపీలో ఒక అగ్ర కులంగా రాజులు ఉన్నారు. వెనకటి కాలంలో రాజ్యాలు చేసిన వారుగా ఉన్నారు ప్రజాస్వామ్యంలో కూడా తమకంటూ గుర్తింపు కలిగి ఉన్నారు.;
ఏపీలో ఒక అగ్ర కులంగా రాజులు ఉన్నారు. వెనకటి కాలంలో రాజ్యాలు చేసిన వారుగా ఉన్నారు ప్రజాస్వామ్యంలో కూడా తమకంటూ గుర్తింపు కలిగి ఉన్నారు. అందుకే చాలా చోట్ల వారు అగ్ర నాయకులుగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో తమది క్రియాశీల పాత్రగా చాటుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ రాజులకు మంత్రి పదవులు కేబినెట్ లో కచ్చితంగా ఉండేవి. 2014లో చూస్తే కేంద్రంలో అశోక్ గజపతిరాజు మంత్రిగా ఉండడం జరిగింది అది టీడీపీ కోటావే కాబట్టి క్షత్రియ సమాజం ఫుల్ జోష్ లో ఉండేది. ఇక 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పాలనలో కూడా తొలి మూడేళ్ళ పాటు క్షత్రియులకు న్యాయం చేశారు. చెరుకూరి రంగనాధరాజుకు మంత్రి పదవి దక్కింది.
అయితే మలి విడతలో మాత్రం వారికి మొండి చేయే దక్కింది. దంతో క్షత్రియులు వైసీపీకి కొంత దూరం పాటించారు. అప్పటికే మెజారిటీ క్షత్రియులు టీడీపీకి బీజేపీకి అండగా ఉంటూ వస్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో వన్ సైడెడ్ గా క్షత్రియ సమాజం కూటమి వైపు మొగ్గు చూపిందని చెబుతారు. దాని ఫలితంగా చాలా మంది ఆ సామాజిక వర్గం నుంచి గెలిచారు.
ఇక నరసాపురం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. దాంతో ఏపీలో టీడీపీ కూటమి ఆ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి కూర్పు చేశారు దాంతో టీడీపీలో ఉన్న క్షత్రియులతో పాటు బయట వారు కూడా ఒకింత విస్మయానికి అలాగే కలవరానికీ గురి అయ్యారు. అశోక్ గజపతిరాజు 2024 ఎన్నికల్లో పోటీ చేయలేదు.
దాంతో ట్రిపుల్ ఆర్ గా పేరు పొందిన రఘురామ క్రిష్ణంరాజుకు పదవి మంత్రి వస్తుందని అనుకున్నారు. కానీ ఆయనకు ఆ పదవి దక్కలేదు కానీ కేబినెట్ ర్యాంక్ తో కూడిన డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు. అలా కొంత బ్యాలెన్స్ చేసినా రాజులలో అయితే అసంతృప్తి ఉందనే అంటూ వచ్చారు.
ఇక ఇపుడు చూస్తే ప్రతిష్టాత్మకమైన గవర్నర్ పదవి విజయనగరం నుని పూసపాటి అశోక్ గజపతి రాజుకు దక్కింది. దాంతో యావత్తు క్షత్రియ సమాజం ఆనందంతో పరవశిస్తోంది. గవర్నర్ గా రాజ్ భవన్ లో ఆ సామాజిక వర్గం నుంచి తెలుగు నాట అడుగుపెట్టిన వారు లేరు. స్వాతంత్రానికి పూర్వ సంగతేమో కానీ స్వాతంత్ర్యం వచ్చాక మాత్రం ఇది ఒక అరుదైన గౌరవంగానే భావిస్తున్నారు.
అదే సమయంలో ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది. కేంద్రంలో టాప్ పోర్టు ఫోలియోను నిర్వహించిన అశోకి కి ఏదైనా పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా పంపి ఉంటే బాగుండేది అని అంటున్నారు. మరో వైపు చూస్తే రఘురామకు డిప్యూటీ స్పీకర్ అయినా అశోక్ కి గవర్నర్ పదవి అయినా రెండూ రాజ్యాంగబద్ధమైన పదవులే. దాంతో మంత్రి పదవి ఉంటే ఎంతో కొంత మేలు జరిగేది కదా అన్న భావనలో ఉన్న వారూ ఉన్నారు. మొత్తం మీద క్షత్రియ సమాజం గతం కంటే ఇపుడు చాలా వరకూ హ్యాపీగానే ఉంది. అంతే కాదు ఫ్యూచర్ లో తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో అవకాశం దక్కుతుందని కూడా ఆశిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.