• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నాగబాబులో అంతులేని...

నాగబాబులో అంతులేని వైరాగ్యం...రీజనేంటో ?

| ఇక పోస్టులో నాగబాబు రాసిన లైన్లు చూస్తే కనుక చాలానే ఉన్నాయి. ఏది వాస్తవంలో ఏది భ్రమో అర్ధం కాదు, మెదడులో నిక్షిప్తం అయినవన్నీ నిజాలుగా మనసు అద్దం చూపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2025-05-14 17:46 GMT

మెగా బ్రదర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాయకుడు ఇలా ఎన్నో ఆయన పేరుకు ముందు ఉంటాయి. ఆయనే కొణిదెల నాగబాబు. ఆయన ఎపుడూ ఫైర్ బ్రాండ్ మాదిరిగానే ఉంటారు. ట్వీట్లు వేశారంటే పంచులకే పండుగ. సెటైర్లకే సందడి అన్నట్లుగా ఉంటారు.

అలాంటి నాగబాబు సోషల్ మీడియాలో తన ఎక్స్ లో తాజాగా పెట్టిన ఒక పోస్టు అయితే తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్టు కంటే నాగగాబు ఫోటో మరింత వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో నాగబాబు రాళ్ళ గుట్ట మీద కూర్చుని సదూరంగా ఉన్న సాగరాన్ని చూస్తున్నారు. ఆ ఫోటోయే ఎన్నో అర్ధాలు చెబుతోంది.

ఇక పోస్టులో నాగబాబు రాసిన లైన్లు చూస్తే కనుక చాలానే ఉన్నాయి. ఏది వాస్తవంలో ఏది భ్రమో అర్ధం కాదు, మెదడులో నిక్షిప్తం అయినవన్నీ నిజాలుగా మనసు అద్దం చూపిస్తుంది. దాంతో అవే బహుశా నిజాలు అని భ్రమపడుతూంటామని ఆయన రాసుకొచ్చారు.

మనం ఆకలితో ఉన్నపుడు ఆహారం రుచి అద్భుతంగా ఉంటుంది. అదే కడుపు నిండితే ఆ ఆహారమే ఒక సాధారణ రుచిగా మారుతుంది. ఏదీ వాస్తవం కాదు అంతా నీ ఆలోచనలకే నీవు ఎలా అనుకుంటావో అలాగే కనిపిస్తుంది మెదడు ఎపుడూ వాస్తవాలను చూపించదు. నీవు ఏది నిజమని నమ్ముతావో అదే మెదడు కూడా చూపిస్తుంది. అంతా ఆలోచనలలోనే ఉంది అంటూ చాలా కవితాత్మకమైన ధోరణిలో నాగబాబు ఈ పోస్టులో రాసుకొచ్చారు.

దానిని చూసిన నెటిజన్లు నాగబాబు స్వీయ అనుభవమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన పెట్టిన ఫోటో అంతులేని సాగరంలోని ఆయన ఆలోచనాత్మకంగా చూస్తూ ఉండడం ఇవన్నీ చూస్తూంటే నాగబాబు ఏదో చెప్పాలనుకుని ఇలా చెప్పి ఉంటారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని అంతా భావించారు. అది కూడా మార్చి 30న ఉగాది వేళ అని ముహూర్తం కూడా పెట్టేసారు. అయితే అది జరిగి రెండు నెలలకు దగ్గర అవుతున్నా ఆ సూచనలు అయితే లేవు. ఉప ముఖ్యమంత్రి పవన్ నాగబాబుకు అండగా ఉండడంతో ఎమ్మెల్సీ కాగలిగారు. మంత్రి పదవి అంటే బాబు కరుణా కటాక్ష వీక్షణాలు కావాలి.

మరి అది ఎపుడు జరుగుతుందో తెలియదు. దాంతో నాగబాబులో అసహనం పెల్లుబుకుతోందా అన్నది కూడా చర్చగా ఉంది. దాంతోనే ఆయన ఈ విధంగా జనరలైజ్ చేస్తూ ఈ తరహా పోస్టు పెట్టి ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి లోతు అయిన భావాలతో నాగబాబు పెట్టిన ఈ పోస్టుతో ఆయనలో వైరాగ్యం ఈ విధంగా ప్రతిఫలించిందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఈ పోస్టు తరువాత రాజకీయంగా ఏమైనా సమీకరణలు మారుతాయో ఏమో.

Reality is an illusionFood tastes amazing when you're hungry.But when you're full that same food just tastes normal.Five minutes feels endless when you're bored.But it flies when you're doing something you enjoy.Nothing is real, everything is just how you perceive it.The… pic.twitter.com/gIGs08Rh24

— Naga Babu Konidela (@NagaBabuOffl) May 14, 2025
Tags:    
  • Nagababu 
  • KonidelaNagababu 
  • Janasena 
  • NagababuTweet 
  • PoliticalBuzz 
  • CabinetSpeculations 
  • NagababuMLC 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS