బ్రేకింగ్.. కొడాలి నాని హెల్త్ లేటెస్ట్ అప్ డేట్!
మాజీ మంత్రి కొడాలి హెల్త్ కి సంబంధించి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.;
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే కథనాలు చర్చనీయాంశంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ అవ్వడం, ఆయన ఆరోగ్య పరిస్థితులపై అభిమానుల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొందని అంటోన్న వేళ.. తాజాగా కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... మాజీ మంత్రి కొడాలి హెల్త్ కి సంబంధించి కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో సుమారు గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. నేడు డిశ్చార్జ్ అయ్యి.. ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక విషయాలు వెళ్లడించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా... తొలుత గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని ఆస్పత్రిలో చేరగా.. పూర్తిస్థాయి వైద్య పరీక్షల అనంతరం అయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని చెబుతున్నారు. ఈ సమయంలో.. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అవ్వగా.. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమవ్వచ్చని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో.. సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీనిపై సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... కొంతకాలం చికిత్స తీసుకున్న తర్వాత సర్జరీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.