కన్నతల్లి ఒడిలోనే రక్షణ లేదా?.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఒకటిన్నర సంవత్సర బాలుడి విషాద గాధ!
ప్రతి ఒక్కరినీ తీవ్రంగా చలింపజేసిన ఈ గుండెలవిసే దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సమాజం తలదించుకునే ఒక అత్యంత అమానుషమైన ఘటన కేరళలో వెలుగుచూసింది. కేవలం ఒకటిన్నరేళ్ల పసికందుపై కన్నతల్లి, ఆమె రెండో భర్త కలిసి చేసిన చిత్రహింసలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిరంతరం సాగిన శారీరక దాడి తట్టుకోలేక ఆ పసి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ప్రతి ఒక్కరినీ తీవ్రంగా చలింపజేసిన ఈ గుండెలవిసే దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అన్నం తింటూ పడిపోయాడని డ్రామాలు:
కేరళలోని నెడుమంగాడ్‌లో ఈ ఘోరం జరిగింది. ఒకటిన్నరేళ్ల చిన్నారి అర్షిద్ ఇంట్లో అన్నం తింటూ అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడంటూ ఆసుపత్రికి తరలించారు. అయితే శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు. ఇక బాబు మృతిపై అనుమానం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి.
పోస్ట్‌మార్టంలో తేలిన భయంకర నిజాలు:
బాబు మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూసి డాక్టర్లు, పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. ఆ చిన్నారి శరీరంపై ఏకంగా 51 గాయాలు ఉన్నట్లు తేలింది. గుప్తాంగాలపై గాయాలు, సిగరెట్ కాలిన గుర్తులు, అంతర్గత రక్తస్రావం, పాత ఫ్రాక్చర్లు ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో బయటపడింది. బాబుది సహజ మరణం కాదని, రోజూ దారుణంగా కొట్టడం వల్లే చనిపోయాడని నిర్ధారణ అయ్యింది.
కన్నతల్లి, సెంకడ్ హస్బెండ్ అరెస్ట్:
ఈ దారుణానికి ఒడిగట్టిన చిన్నారి తల్లి అఖిల, ఆమె రెండో భర్త అష్కర్‌లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఇక నెడు మంగాడ్ డీఎస్పీ నేతృత్వంలో వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకు ముందే బాబు తాతమ్మ, నానమ్మలు బాబు ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించి, తమకు కస్టడీ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కానీ, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.
ప్రభుత్వం సీరియస్: కఠిన చర్యలు:
ఈ హృదయ విదారక ఘటనపై కేరళ మంత్రి బిందు కృష్ణ తీవ్రంగా స్పందించారు. ఒకటిన్నరేళ్ల పసికందును తల్లి, సవతి తండ్రి ఇంత దారుణంగా హింసించి చంపడం రాష్ట్రంపై జరిగిన నేరంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఇక ఇలాంటి చైల్డ్ అబ్యూస్ ఘటనల పట్ల ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని, పిల్లల రక్షణ కోసం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పసిప్రాణానికి దక్కని రక్షణ:
అమ్మ ఒడిలో సురక్షితంగా ఉండాల్సిన పసికందు, కన్నతల్లి చేతిలోనే బలైపోవడం సమాజంలో మానవత్వం ఎంత దిగజారిపోయిందో చూపిస్తోంది. ఇక ప్రస్తుతం ఆ బాబు మృతదేహాన్ని పలోడ్‌లోని అతని అసలు తండ్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అమాయక పసిప్రాణాన్ని బలితీసుకున్న ఆ కిరాతకులకు చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..