కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లెక్కేంటి ?

ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు కలిపి థర్డ్‌ ఫ్రంట్‌గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

Update: 2024-05-01 07:16 GMT

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా ? ఎన్డీఎ, ఇండియా కూటమి కాకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పడబోతుందా ? బీజేపీ కూటమి 200 స్థానాలకే పరిమితం కాబోతున్నదా ? అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవుననే అంటున్నారు.

పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు కలిపి థర్డ్‌ ఫ్రంట్‌గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇదేమీ అసంభవం కాదు అని కేసీఆర్ చెబుతున్నారు.

మొదటి, రెండో విడత పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ కూటమికి గానీ, ఇండియా కూటమికి గానీ సానుకూల పవనాలు లేవని అర్దమవుతుందని, అందుకే లోక్ సభ ఫలితాల తర్వాత అనూహ్య పరిణామాలు ఉంటాయని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో గౌరవప్రదమైన సీట్లు దక్కించుకోవడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధించుకునేందుకు కేసీఆర్ రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతారా ? లోక్ సభ ఫలితాల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పుతారా ? వేచిచూడాలి.

Tags:    

Similar News