ఆర్మీ ఆఫీసర్ గా మారిన మిస్ ఇంటర్నేషనల్.. ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

విషయంలోకి వెళ్తే.. మహారాష్ట్ర పూణేకు చెందిన కాశిష్ మోత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు.;

Update: 2025-09-15 07:15 GMT

ఎవరైనా సరే అందాల పోటీలలో నెగ్గిన తర్వాత కచ్చితంగా సినిమాలలోకే రావడానికి ఇష్టపడతారు.. కానీ ఇక్కడ ఒక మిస్ ఇంటర్నేషనల్ ఇండియా మాత్రం ఆర్మీ ఆఫీసర్ గా అవతారం ఎత్తి.. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరి ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఏ విభాగంలో ఆమె ఇప్పుడు అధికారం చేపట్టారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

విషయంలోకి వెళ్తే.. మహారాష్ట్ర పూణేకు చెందిన కాశిష్ మోత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అమ్మడికి.. మోడలింగ్ తో పాటు యాక్టింగ్ లో కూడా ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ వాటన్నింటినీ తిరస్కరించి దేశ సేవయే లక్ష్యంగా ముందడుగు వేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేసిన ఈమె హార్వెర్డ్ లో పిహెచ్డి ఛాన్స్ కూడా దక్కించుకుంది. కానీ వీటన్నింటిని పక్కన పెట్టేసి.. దేశం కోసం ఆర్మీలో చేరాలనుకుంది. అందులో భాగంగానే 2024 సీడీఎస్ ఎగ్జామ్ లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించిన ఈమె.. ప్రస్తుతం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD)లో పనిచేస్తున్నారు. ఏదేమైనా మోడలింగ్ రంగంలో.. అటు సినిమాలలో ఎన్ని అవకాశాలు వచ్చినా.. ఈ గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి దేశానికి సేవ చేయడం కోసం అటు ఆర్మీలోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది కాశీష్ మోత్వానీ. ప్రస్తుతం ఈమె త్యాగానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే కాశిష్ మోత్వానీ ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." నేను ఏదో ఒక ఎంపికలో ఉండాలని అనుకోలేదు. నేను మిస్ ఇండియా కావాలి అని, అధికారి కావాలి అని, శాస్త్రవేత్త కూడా కావాలని కోరుకున్నాను. అందుకే ఒక్క రంగాన్ని ఎంచుకోలేదు. అన్ని రంగాలను అనుసరించి అన్నింటిలో కూడా రాణించాలని అనుకున్నాను. చివరికి నేను అదే ఎంచుకున్నాను అంటూ మనసులో మార్పు మాత్రమే కావాల్సింది" అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

కెరియర్ విషయానికి వస్తే.. పూణేకి చెందిన కాశిష్ మోత్వానీ సూపర్ మోడల్, మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023 టైటిల్స్ గెలుచుకుంది. సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి న్యూరో సైన్స్ లో ఎంఎస్సీ థీసిస్ పూర్తి చేసింది. ఇప్పుడు భారతదేశంలో అధికారిగా నియమితులు అయ్యింది. 2024లో కంబైన్డ్ డిఫెరెంట్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన ఈమె.. చెన్నైలోనే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కూడా చేరింది. చిన్నప్పటి నుంచే పలు పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించే ఈమె.. తల్లిదండ్రులే తనను ఆ దిశగా అడుగులు వేసేలా చేశారు" అని చెప్పుకు వచ్చింది. ముఖ్యంగా సాంస్కృతిక, ఇతర కార్యక్రమాలలో కూడా పోటీపడుతూ మంచి ఫలితాలు సొంతం చేసుకున్నట్లు కాశిష్ మోత్వానీ వెల్లడించింది ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్, ఈమె తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Tags:    

Similar News