ఇది ఆధునిక దుర్యోధన.. దుశ్శాసనుల లోకం.. కర్ణాటక హైకోర్టు సీరియస్

సభ్య సమాజం తలదించుకునేలా.. కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలంగా మారింది.

Update: 2023-12-15 05:36 GMT

సభ్య సమాజం తలదించుకునేలా.. కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలంగా మారింది. ఎంగేజ్ మెంట్ అయిన ఒక అమ్మాయిని.. మరో అబ్బాయి తమ మధ్య ఉన్న ప్రేమ కారణంగా పెద్దలకు చెప్పకుండా తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ఉదంతంలో అమ్మాయి తరఫు వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. అబ్బాయితల్లిపట్ల వారు ఎంత అమానుషంగా వ్యవహరించింది తెలిసిందే.

అమ్మాయి తరఫు వారు అబ్బాయి వారింటికి వెళ్లి.. అతడి తల్లిని ఇంట్లో నుంచి బయటకు లాక్కు రావటమే కాదు.. వస్త్రాల్ని విప్పేసి..నగ్నంగా ఊరంతా ఊరేగించారు. అక్కడితో ఆగని వారి పైశాచికత్వం.. ఆమెను ఊరి మధ్యలో స్తంభానికి కట్టేసి.. కొట్టేసిన వేళలోనూ ఎవరూ అడ్డుకోలేదు. ఈ దారుణ ఉదంతం గురించి పోలీసులకు సమాచారం అంది.. హుటాహుటిన వారెళ్లి ఆమెను రక్షించారు. ఆమెనుఆసుపత్రికి చేర్చి వైద్యసేవల్నిఅందిస్తున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసి.. నిందితుల్ని అరెస్టు చేశారు.

తాజాగా ఈ ఉదంతంపై కర్ణాటక హైకోర్టు రియాక్టు అయ్యింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై స్పందించిన కర్ణాటక హైకోర్టు.. ‘‘ఇది ఆధునిక దుర్యోదన దుశ్శాసనుల లోకం’ అని వ్యాఖ్యానించింది. ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నప్పుడు.. ఏ ఒక్కరు మానవత్వంతో కానీ ధైర్యంగా కానీ స్పందించకపోవటంపై విస్మయాన్ని వ్యక్తం చేసింది. ధైర్యాన్ని ప్రదర్శించకపోవటాన్ని దురద్రష్టకర సంఘటనగా పేర్కొంది.

Tags:    

Similar News