డిలీట్ అవుతున్న కంచె గచ్చిబౌలి వీడియోలు
పర్యావరణ విధ్వంసం పేరుతో ఏఐ ఆదారిత నకిలీ ఫోటోలు. వీడియోల్ని క్రియేట్ చేసి తప్పుదారి పట్గించిన వైనం తెలిసిందే.;
దాదాపు వారానికి పైనే తెలంగాణలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆ మాటకు వస్తే జాతీయ స్థాయిలోనూ సంచలనంగా మారిన కంచె గచ్చిబౌలి భూమలకు సంబంధించిన ఎపిసోడ్ లో సోషల్ మీడియాలో పోస్టు అయిన పలు వీడియోలు.. పోస్టులు ఇప్పుడు భారీగా డిలీట్ అవుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు కంచె గచ్చిబౌలికి సంబంధించినవిగా చెప్పే వీడియోలు.. ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. చూసినంతనే మనసును హత్తుకునేలా ఉన్న వీటిని పలువురు షేర్ చేశారు.
అయితే.. ఈ వీడియోలు.. పోస్టులు ఫేక్ అన్న విషయం వెలుగు చూడటం.. పలువురికి నోటీసులు ఇవ్వటంతో.. ఇంతకాలం సామాజిక బాధ్యతగా ఫీలై షేర్ చేసినోళ్లు.. పోస్టు చేసినోళ్లు తమ పోస్టుల్ని డిలీట్ చేసుకుంటున్నారు. కంచె గచ్చిబౌలి భూమల్ని చదును చేసేందుకు తెప్పించిన జేసీబీల దెబ్బకు ఆ భూమల్లో ఉన్న జింకలు పెద్ద ఎత్తున ప్రాణభయంతో పరుగులు తీస్తున్నట్లుగా.. నెమళ్లు ఏడుస్తున్నట్లుగా పలు వీడియోలు.. ఫోటోలు అదే పనిగా వైరల్ కావటం తెలిసిందే.
పర్యావరణ విధ్వంసం పేరుతో ఏఐ ఆదారిత నకిలీ ఫోటోలు. వీడియోల్ని క్రియేట్ చేసి తప్పుదారి పట్గించిన వైనం తెలిసిందే. ఈ ఫోటోలు.. వీడియోల్ని నమ్మ నిజంగానే అవన్నీ వాస్తవాలుగా భావించి పెద్ద ఎత్తున షేర్ చేశారు. అదెంత భారీగా సాగిందంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్ని దాటేసి ఢిల్లీ వరకు వెళ్లం.. అక్కడి ప్రముఖులు సైతం రేవంత్ సర్కారు తీరును తప్పు పెడుతూ.. రీట్వీట్ చేయటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ వైరల్ కంటెంట్ లో నిజం లేదని.. అన్నీ కల్పితమన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా నిద్ర లేచిన సర్కారు నష్టనివారణ చర్యలు చేపట్టారు.
అయితే.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రేవంత్ ప్రభుత్వం మీద పెద్దఎత్తున విమర్శలు రావటంతో.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిని తప్పులో కాలేయించిన ఫేక్ ఫోటోలు.. వీడియోల వ్యవహారాన్ని తేల్చాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో పలువురు మీద ప్రభుత్వం లీగల్ గా ప్రొసీడ్ అయ్యింది. ఇందులో భాగంగా నోటీసులు పంపటం.. వారిపై కేసులు నమోదు చేయటం షురూ చేశారు. దీంతో.. అసలు విషయం అర్థమైన పలువురు తమ పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు.
ఈ నోటీసుల పర్వం బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ మొదలు కొని పలువురికి అందింది. ఇదిలా ఉంటే.. ఫేక్ పోస్టుల్ని తెలిసి చేసినా.. తెలీకుండా పోస్టు చేసినా.. తప్పు తప్పేనని.. అలాంటి వారిపై చర్యలు ఖాయమన్న మాటను సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఈ తప్పుడు వీడియోల విషయాన్ని అర్థం చేసుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లు కూడా తమ పోస్టుల్ని డిలీట్ చేయటంతో.. మిగిలినవారు అదే బాట పట్టారు.