షర్మిల - కవిత... 'ఇద్దరి భర్తల పేరు అనిలే... ఇద్దరి ఆశలు ఆకాశంలోనే'!
అవును... కేఏ పాల్... ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు తెలియని వారు బహు తక్కువమంది ఉంటారని చెబుతుంటారు!;
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఓ రకంగా సంచలనం అనే చెప్పాలి. రాజకీయాల్లోకి రాకముందు, గతంలో ఆయన వైభవం సంగతి కాసేపు పక్కనపెడితే.. ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన ఓ ఫుల్ ఎంటర్ ట్రైనర్ అని ఒకరంటే... వాస్తవాలు చెప్పే వ్యక్తి అని మరికొంతమంది ఫ్యాన్స్ అంటుంటారు! ఈ క్రమంలో తాజాగా కవిత, షర్మిల పై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.
అవును... కేఏ పాల్... ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు తెలియని వారు బహు తక్కువమంది ఉంటారని చెబుతుంటారు! ఆ సంగతి కాసేపు పక్కనపెడితే... ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారు ఉండరనే చెప్పొచ్చు! ఇక తాజా విషయానికొస్తే... వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత గురించి తాజాగా కేఏ పాల్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఇప్పుడు అవి వైరల్ గా మారుతున్నాయి.
ఇందులో భాగంగా... "తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కవిత, ఏపీలో షర్మిల.. ఏమిటీ వీళ్ల గొడవ, ఎందుకు వీళ్లు రాజకీయాల్లోకి వచ్చారు?" అని మొదలుపెట్టిన పాల్... షర్మిల పార్టీ పెట్టినప్పుడే తాను చెప్పానని.. ఈమె బీజేపీ లేదా కాంగ్రెస్ సంధించిన బాణం అని, వాటిలో ఏదో ఒక పార్టీలో చేరిపోతారు, మీరు మోసపోవద్దని ప్రజలకు సూచించినట్లు తెలిపారు.
అయితే తన మాటలు వినకుండా లక్షల మంది మోసపోయారని.. వందల మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నారని.. అందులో ఓ 40 మందిని తాను కలిశానని.. అన్న పదవి ఇవ్వలేదని, రావాల్సిన కోట్లు పంచలేదని, తల్లిద్వారా చర్చలు జరిపినా వినలేదని, ఆ విషయం మనకు తెలుసని కేఏ పాల్ పేర్కొన్నారు.
ఇక కవిత విషయానికొస్తే... అన్నయ్యకు పదవి ఇచ్చేశారు.. కోట్ల రూపాయలు ఇచ్చేశారు.. నాకేమీ ఇవ్వలేదు.. నేను ఊరుకుంటానా.. ఆయనకు 3 లక్షల కోట్లు ఇస్తే నాకు 3 లక్షల కోట్లు ఇవ్వండి.. ఆయనకు సీఎం పదవి ఇస్తే, నాకు సీఎం పదవి ఇవ్వండి.. అనేదే గొడవ అని పాల్ వెల్లడించారు!
ఈ సందర్భంగా... అటు చంద్ర ‘శేఖర్’ (కేసీఆర్) కూతురు కవిత, రాజ ‘శేఖర్’ (వైఎస్సార్) కూతురు షర్మిల... ఇద్దరి భర్తల పేరు అనిలే... ఇద్దరి ఆశలు ఆకాశంలోనే.. అని చెప్పిన పాల్.. ఇలాంటి కుటుంబ, కుల పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఇంకా మోసపోవడం అవసరమా అని నిలదీశారు!
ఇదే సమయంలో... బీసీలు 60% ఉన్నారని.. అయినప్పటికీ ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించిన పాల్... బడుగు బలహీన వర్గాల ప్రజలు 90% ఉన్నా ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా అని అడిగారు. అయినప్పటికీ వాళ్లు ఇచ్చే 100కి, 1000కి, లక్షకు ఎందుకు మోసపోతున్నారని నిలదీశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.