నడ్డాపై కేసు .. రేవంత్ కేసుకు కౌంటరా ?

దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేసి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.

Update: 2024-05-09 06:03 GMT

ముస్లిం రిజర్వేషన్ల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మార్పింగ్ చేసి రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పినట్లు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆ పోస్టు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ పై కేసులు నమోదు చేశారు.

దాంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేసి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో తాను హాజరు కాలేనని రేవంత్ సమాధానం ఇచ్చాడు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లగా కోర్టు కూడా నాలుగు వారాల గడువు విధించింది. అయితే మే5న బీజేపీ ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అది ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని బెంగుళూరు పోలీసులు ట్విట్టర్ ఎక్స్ కు వెళ్లడించారు. అదే రోజు బెంగుళూరు డీజీపీ కార్యాలయం ఆ ట్వీట్ మీద విచారణకు ఆదేశించింది.

ఈ మేరకు బెంగుళూరు హైగ్రౌండ్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదయింది. ముస్లింలకు వ్యతిరేతకంగా ఉన్న ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాకు, బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాళవియా, బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ బీవై విజయేంద్రకు సమన్లు జారీచేశారు బెంగళూరు పోలీసులు. వారం రోజుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

బెంగుళూరు పోలీసులు నడ్డాకు సమన్లు జారీచేయడం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మీద నమోదయిన కేసుకు కౌంటర్ అని భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేయడం మూలంగానే ఇరుక్కున్నాయి. దీంతో బీజేపీ పెట్టిన కేసుకు కౌంటర్ గా బెంగుళూరులో నడ్డా మీద కేసు పెట్టినట్లు భావిస్తున్నారు. ఈ వార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ గా మారిందని అంటున్నారు. తెలంగాణలో కేసు పెడితే అది ఖచ్చితంగా కౌంటర్ అని భావించే బెంగుళూరులో కేసు పెట్టించినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.

Tags:    

Similar News