రేవంత్‌ను వ‌ద్ద‌నుకునే వారు పెరుగుతున్నారు: జీవ‌న్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన‌.. మాజీ మంత్రి, జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.;

Update: 2026-04-03 10:28 GMT

కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన‌.. మాజీ మంత్రి, జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం సీటు విష‌యంపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంద‌న్నారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గ్రాఫ్ డౌన్ అయింద‌ని.. ఆయ‌న‌ను వ‌ద్దునుకునే వా రు పెరుగుతున్నార‌ని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి.. తాను చెప్పేవి వారి చెవిని ఎక్క‌వ ని వ్యాఖ్యానించారు.

``రెండున్న‌రేళ్ల కాలంలోనే ప్ర‌జ‌లకు ఈ పాల‌న మొహం మొత్తింది. అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నా రు. ఎవ‌రికీ పాల‌న న‌చ్చ‌ట్లేదు.`` అని జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని విష‌యాల్లోనూ సీఎంగా రేవంత్ రెడ్డి విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు. ప్రాణ‌హిత న‌దిని వినియోగించ‌డంలోనూ ఆయ‌న ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. రైతుల‌కు ఇస్తున్న సొమ్ము కూడా స‌రిగా అంద‌డం లేద‌న్నారు. త‌న ప్ర‌చారం కోసం.. ప‌నిచేస్తున్న‌ట్టుగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

తాను ఏ పార్టీలో చేరేదీ.. త‌న భ‌విష్య‌త్తు ఏంటి? అనేది త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్న‌ట్టు జీవ‌న్‌రెడ్డి తెలిపారు. త‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడి ఈ విషయంపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. త‌న‌కు కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో బీజేపీ నాయ‌కులు, బీఆర్ఎస్ నాయ‌కులు కూడా అండ‌గా ఉన్నార‌ని చెప్పారు. వారి వ‌ల్లే.. కొన్ని కొన్ని స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌న్నారు. వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే.. ఏపార్టీలో చేరేదీ నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. త‌న కార్య‌క‌ర్త‌ల అభిప్రాయం మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

Tags:    

Similar News