కిర్లంపూడిలో ముద్రగడకు నివాళి అర్పించనున్న జగన్
వైసీపీలో ముద్రగడ శిష్యులు అనుచరులు ఎందరో చేరారు. కానీ ముద్రగడ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని చేరలేదు అని అంటారు.
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి జగన్ పరామర్శించారు. ముద్రగడ మరణం తనను తీవ్రంగా కలచివేసింది అని జగన్ పేర్కొన్నారు. ప్రజల కోసం ముద్రగడ చేసిన సేవలు గొప్పవని అన్నారు. ఆయనది రాజీలేని పోరాటం అన్నారు. ప్రజలనే ఆయన నమ్మారని వారి కోసమే పనిచేశారు అని జగన్ కొనియాడారు. ముద్రగడ కుటుంబం ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు.
కిర్లంపూడికి జగన్ :
ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కిర్లంపూడికి జగన్ బుధవారం వస్తున్నారు. ముద్రగడ పార్ధివ దేహానికి ఆయన నివాళి అర్పించనున్నారు. జగన్ తాడేపల్లి నుంచి నేరుగా జగ్గంపేటకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన ముద్రగడ నివాసానికి వెళ్తారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. ముద్రగడకు నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తారని చెప్పారు.
ముద్రగడ జగన్ బంధం :
ఇదిలా ఉంటే ముద్రగ పద్మనాభం జగన్ ల మధ్య రాజకీయపరంగా వయసు రీత్యా చాలా తేడా ఉంది. ఈ ఇద్దరూ మొదట్లో ఎక్కడా కలిసిన సందర్భాలు కూడా లేవు, వైసీపీని జగన్ ప్రారంభించిన నేపథ్యంలో గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గం నాయకులను ఫోన్ల ద్వారా పిలిచి మరీ తన పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలోనూ జగన్ వైసీపీలోకి ముద్రగడ చేరలేదు, ఇక వైసీపీలోకి కాంగ్రెస్ లోని కాపులతో పాటు టీడీపీలో అసంతృప్తితో ఉన్న వారు అంతా చేరారు. ఇక చెప్పాలీ అంటే వైసీపీ తూర్పు గోదావరి జిల్లాలోనే ఏర్పాటు అయింది. అంటే ముద్రగడ సొంత జిల్లా. వైసీపీలో ముద్రగడ శిష్యులు అనుచరులు ఎందరో చేరారు. కానీ ముద్రగడ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని చేరలేదు అని అంటారు.
జగన్ ని విమర్శించని వైనం :
అదే సమయంలో ముద్రగడ వైసీపీ అధినేత జగన్ ని పెద్దగా విమర్శించినది లేదు అని గుర్తు చేసుకుంటున్నారు. 2016లో ముద్రగడ చేపట్టిన కాపు ఉద్యమానికి బేషరతుగా వైసీపీ మద్దతు ఇచ్చింది. వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు సహా ఎందరో నేతలు ముద్రగడ కాపు ఉద్యమానికి ప్రత్యక్షంగా సంఘీభావం తెలిపారు. ఇక ముద్రగడ కాపులకు బీసీలలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు. అయితే కాపులకు బీసీ రిజర్వేషన్లు విషయంలో జగన్ తన చేతిలో లేదని చెప్పారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2019లో తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వలేనని జగన్ ఏకంగా ముద్రగడ సొంత ప్రాంతం అయిన కిర్లంపూడిలోనే ప్రకటించారు. రిజర్వేషన్లు కేంద్ర పరిధిలోనివని తన చేతిలో లేదని జగన్ చెప్పారు.
వైఎస్సార్ సమకాలీనుడు ముద్రగడ :
ఇవన్నీ ఇలా ఉన్నా కూడా జగన్ అంటే ముద్రగడ ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ వచ్చారు. ఆయన 2024లో గెలిచి తీరుతారు అని కూడా పార్టీలో చేరిన సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇటీవల కాలంలో ముద్రగడ 2029లో వైసీపీ గెలుస్తుందని ప్రకటించిన నేపథ్యంలో కూడా ఉందని వైసీపీ నేతలు చెబుతారు.ఈ విధంగా జగన్ ముద్రగడల మధ్య మంచి అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. నిజానికి వైఎస్సార్ సమకాలీనుడు ముద్రగడ. 1978లో వైఎస్సార్ ముద్రగడ ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక 2009లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా పిఠాపురం నుంచి కాంగ్రెస్ టికెట్ మీద ముద్రగడ పోటీ చేశారు. అదే ఆయన చివరిసారిగా ఎన్నికల గోదాలోకి దిగడం అని గుర్తు చేసుకుంటున్నారు. అలా వైఎస్సార్ తో ఉన్న బంధాన్ని జగన్ తోనూ కొనసాగించారు అని చెబుతారు.