జనసేన పంచ వ్యూహం...గురి తప్పదంతే !

కురుక్షేత్ర యుద్ధంతో పద్మవ్యూహం ఎంతలా పాపులర్ అయిందో అందరికీ తెలుసు.;

Update: 2025-12-18 13:30 GMT

కురుక్షేత్ర యుద్ధంతో పద్మవ్యూహం ఎంతలా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. అలాగే రాజకీయ కురుక్షేత్రంలో ఎన్నో వ్యూహాలు ఎత్తులు వేయాల్సి ఉంటుంది. జనసేన ఏపీ రాజకీయాలో ప్రధాన రాజకీయ పక్షంగా ఉంది. వీలు చూసుకుని తమ స్థాయిని పెంచుకుని మరింతగా పటిష్టం కావాలని చూస్తోంది. దాంతో ఆ పార్టీ ఇపుడు పూర్తిగా సంస్థాగతమైన వ్యవహారాల మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది అని వార్తలు వస్తున్నాయి. ఒకనాడు జనసేన మీద ఏదైతే ఆరోపణలు విమర్శలు ఉన్నాయో వాటి అన్నింటికీ చెక్ పెడుతూ జనసేన తనదైన వ్యూహంతో గురి తప్పకుండా దూసుకుని పోవాలని చూస్తోంది అంటున్నారు

పిఠాపురంలో ప్లాన్ :

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎక్కువ సమయం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. కాబట్టి తనకు బదులుగా ప్రభుత్వ పార్టీ వ్యవహారాలను చూసేందుకు ఇంచార్జి నేతలను నియమించుకున్నారు. అయితే ఒకరికే అవకాశం ఇస్తే మిగిలిన వారిలో అసంతృప్తి చెలరేగి అది వేరే విధంగా సంకేతాలు ఇస్తోంది. దాంతో సమిష్టి బాధ్యతగా ఫైవ్ మెన్ కమిటీని అక్కడ ఆయన నియమించి పార్టీని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. ఈ కమిటీలో సీనియర్లు పనిచేసిన వారు అంతా ఉన్నారు. దాంతో వీరంతా కో ఆర్డినేషన్ తో పనిచేస్తున్నారు.

ఈసారి రెట్టింపు :

ఇక జనసేన అనేక రకాలైన కారణాల వల్ల 2024 ఎన్నికల్లో 21 సీట్లకే పరిమితం అయింది. అయితే సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో సీట్లు గెలుచుకుని కూటమిలో టీడీపీ తరువాత రెండవ బలమైన మిత్రపక్షంగా ఉంది. ఇక 2029 నాటికి ఈ సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని చూస్తోంది. అంటే 42 అన్న మాట. మరి సీట్లు కొత్తవి డిమాండ్ చేయాలి అంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంది. అందుకే జనసేన తన పార్టీని మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో పటిష్టం చేసే పనిలో ఉంది అని అంటున్నారు.

క్షేత్ర స్థాయిలో :

జనసేన తన పార్టీని బలోపేతం చేసుకోవడం లేదని విమర్శలు ఇంతకాలం వినిపించాయి. ఇపుడు అలాంటి చాన్స్ లేకుండా జనసేన ముందుకు సాగాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న కమిటీలను మొత్తంగా రద్దు చేసింది. వాటి స్థానంలో తొందరలో కొత్తగా గ్రామ వార్డు నుంచి గ్రామం మండలం, నియోజకవర్గం జిల్లా ఇలా అన్ని చోట్లా పటిష్టం చేసుకునేందుకు ఫైవ్ మెన్ కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ ఫైవ్ మెన్ కమిటీలలో పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారితో పాటు సీనియర్లు సామాజిక వర్గం రాజకీయ కోణంలో చూసుకుంటూ సమర్ధులు అయిన వారికి చోటు ఇవ్వాలని చూస్తున్నారు.

సమిష్టి నిర్ణయాలు :

ఈ విధంగా ప్రతీ చోటా ఇంచార్జిని పెట్టి ఫైవ్ మెన్ కమిటీతో సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా చేయడం ద్వారా పార్టీ నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించాలని జనసేన ఆలోచిస్తోంది. దీని వల్ల అందరికీ అవకాశాలు వస్తాయని అదే సమయంలో పార్టీ ఎటూ అధికారంలో ఉంది కాబట్టి మరింతగా పుంజుకుని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎదిగేందుకు వీలు ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలకు కూడా ఈ ప్రయోగం బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. సో జనసేన రెడీ అన్న మాట.

Tags:    

Similar News