• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రమాణస్వీకారవేళ.. జగన్...

ప్రమాణస్వీకారవేళ.. జగన్ దారెటు?

| ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-06-21 04:11 GMT

ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం తెలిసిందే. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. చట్టబద్ధంగా ఎన్నికైన శాసన సభ్యులు తమ పదవీ ప్రమాణస్వీకారాన్ని చేపట్టాల్సి ఉంటుంది. దీనికి ఈ రోజు.. రేపు రెండు రోజుల పాటు చేపట్టేలా ఏపీ అసెంబ్లీ సమావేశాల్ని నిర్వహించనున్నారు. శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం.. జనసేన.. వైసీపీ.. బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ ప్రమాణం చేయనున్నారు.

ఇందులో భాగంగా అసెంబ్లీలో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రులు.. మహిళా సభ్యులు.. సాధారణ సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసే సభ్యుల ప్రాధాన్యత ఇలా ఉంటే.. సాధారణ సభ్యుల ప్రమాణం మాత్రం పేరులో మొదటి అక్షరం వరుస క్రమంలో ఉండనుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాను వైసీపీ సొంతం చేసుకోని నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేయనున్నారు.

ఆంగ్ల అక్షరమాలలో ఆయన పేరు YS Jagan Mohan Reddy ఉన్ననేపథ్యంలో చివర్లోనే ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేయనున్నారు. అయితే.. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాటి అధికార బీఆర్ఎస్ ఓటమిపాలు కావటం.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించే వీలున్నా.. ఎమ్మెల్యే ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. అనుకోకుండా ఆయన బాత్రూంలో జారిపడటం.. గాయాలు పాలు కావటం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఆయన.. తర్వాతి రోజుల్లో స్పీకర్ వద్ద ఒక్కరిగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా జగన్ ఎలా వ్యవహరిస్తారు? అన్నది ప్రశ్నగా మారింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. రెండు రోజుల పాటు సాగే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రమాణస్వీకార అవకాశం రేపు (శనివారం) మాత్రమే వచ్చే వీలుంది. అలాంటప్పుడు ఈ రోజు (శుక్రవారం) అసెంబ్లీకి వచ్చే వీలు లేదంటున్నారు. అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా అసెంబ్లీకి హాజరు కావటం బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమి వేళ.. వెనక్కి తగ్గకుండా.. ముఖం చాటేయకుండా.. కేసీఆర్ మాదిరి కాకుండా తనదైన ముద్రను వేస్తూ ఆయన అసెంబ్లీకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం అవుతుందో చూడాలి.

Tags:    
  • Jaganmohanreddy 
  • Ysrcp 
  • Assembly 
  • Tdp 
  • Chandrababunaidu 
  • Ndaallaince 
  • Pawankalyan 
  • Janasena 
  • Bjp 
  • Kcr 
  • Brs 

Similar News

త్రిష మరో జయలలిత...పోలిక బాగానే ఉంది కానీ ?

2026-11-24 03:46 GMT

కార్తీక పౌర్ణమి....365 ఒత్తుల ఆధ్యాత్మిక సందేశం

2026-11-24 03:46 GMT

జనసేన బలపడినట్లేనా ?

2026-11-24 03:45 GMT

మేయర్లు చైర్మన్లు రేపటి పోటీదారులు !

2026-11-24 02:30 GMT

ఇలాగైతే ఎలా సారూ...కేసీఆర్ ది వ్యూహమా ?

2026-11-24 01:30 GMT

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

2026-11-24 00:56 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

బీజేపీ పాల‌న‌.. ఏకంగా రాష్ట్రం పేరు మార్చేశారు.. రీజ‌న్‌ తెలిస్తే.. అవాక్కే!

2026-11-24 00:50 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

ధ్రువ్ రాఠీకి గట్టి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

2026-11-24 00:28 GMT

Copyright @2026

Powered by Blink CMS