• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వాట్సాప్ వెబ్...

వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? చిన్న నిర్లక్ష్యంతో మీ పని గోవిందా.. కేంద్రం కీలక హెచ్చరిక

| ఆఫీస్ లేదా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ వాడిన తర్వాత ట్యాబ్ మూసేయడం మాత్రమే సరిపోదని సైబర్ భద్రతా అధికారులు హెచ్చరించారు. సెషన్ యాక్టివ్‌గా ఉంటే ఇతరులు చాట్స్ చూడటంతో పాటు మన అకౌంట్ నుంచి మెసేజ్‌లు పంపే ప్రమాదం ఉంది. అందుకే తప్పనిసరిగా లాగౌట్ చేయాలని, ఫోన్‌లో లింక్డ్ డివైజ్‌లను తనిఖీ చేయాలని సూచించారు.

By - A.N.Kumar
Update: 2026-11-24 00:56 GMT

ఆఫీసులో పని హడావిడిలో ఉంటాం... కస్టమర్లతో మాట్లాడాలి.. బాస్‌కు ఫైల్ పంపాలి.. మధ్యలో ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఏదో మీమ్ చూసి నవ్వుకోవాలి... ఇంత పనిని చిన్న ఫోన్ స్క్రీన్‌లో చేస్తే కళ్ళు నొప్పి పుడతాయి కదా.. అందుకే చాలామంది తెలివైన మేధావులు వాట్సాప్ వెబ్ ని ఆవిష్కరించినట్లుగా కంప్యూటర్‌లో తెరిచి పెట్టుకుంటారు. పని అయిపోగానే హమ్మయ్య పని పూర్తయింది అంటూ ఆ బ్రౌజర్ ట్యాబ్‌లోని చిన్న ఎక్స్ బటన్‌పై క్లిక్ చేసి లేచి వెళ్ళిపోతారు. అంతే.. లాగౌట్ అయిపోయిందని మనసులోనే గర్వపడిపోతారు..

కానీ పాపం ఆ ట్యాబ్‌కు తెలియదు... మనకు లాగౌట్ కావాలని ఉందని.. నవంబర్ 18, 2026న కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ ఈ ట్యాబ్ క్లోజ్ మేజిక్ గుట్టు రట్టు చేసింది. పబ్లిక్ కంప్యూటర్లు, ఆఫీస్ సిస్టమ్‌లు, షేర్డ్ ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ సెషన్‌ను అలాగే వదిలేయడం అంటే మన ఇంటి తలుపులకు తాళం వేయకుండా బోర్డు మీద లోపల ఏమీ లేదు.. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళవచ్చు అని రాసి వెళ్ళినట్లేనని అధికారులు ఘాటుగానే హెచ్చరించారు.

ఇదే మన ఆధునిక డిజిటల్ తత్వశాస్త్రం.. బ్రౌజర్‌లో ఒక ట్యాబ్ మూసేస్తే లోపల నడుస్తున్న వాట్సాప్ సెషన్ కూడా ఆవిరైపోతుందని మనం బలంగా నమ్ముతాం. నిజానికి అది సెషన్‌ను దాచిపెడుతుంది తప్ప.. లాగౌట్ చేయదు. మీరు కుర్చీలోంచి లేచి కాఫీ తాగడానికి వెళ్ళగానే మీ పక్క సీట్లో ఉన్న సహోద్యోగో లేక సైబర్ కేఫ్‌లో మీ తర్వాత కూర్చున్న అపరిచితుడో ఆ బ్రౌజర్ తెరిచి.. కొత్త ట్యాబ్‌లో web.whatsapp.com కొడితే చాలు మీ వ్యక్తిగత చాట్స్, సీక్రెట్ జోకులు, ఫ్యామిలీ ఫోటోలు, గ్రూప్ పంచాయితీలు అన్నీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాయి.. అంతేకాదు మీ పేరుతోనే మీ కాంటాక్ట్స్‌కు మెసేజ్‌లు వెళ్ళడం.. అనుమానాస్పద ఫిషింగ్ లింకులు షేర్ కావడం.. ఆఖరికి మీ అకౌంట్ నుంచే ఎవరికైనా ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తే సార్, నేను ట్యాబ్ క్లోజ్ చేశానండీ అయినా మెసేజ్ ఎలా వెళ్ళిందో తెలియదు అంటే ఎవరు నమ్ముతారు? ట్యాబ్ క్లోజ్ చేయడం ఒక ఎత్తు.. వాట్సాప్ మెనూలోకి వెళ్లి లాగ్ అవుట్ నొక్కడం మరో ఎత్తు. రెండోది చేస్తేనే అసలైన భద్రత. సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, ఎవరికో చెందిన ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ లాగిన్ చేయడం అంటే అగ్నితో ఆడుకోవడమే. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే సిస్టమ్ వాడాల్సి వస్తే ప్రైవేట్ లేదా ఇన్‌కాగ్నిటో విండోలో వాడండి.

మీరు పంపని మెసేజ్‌లు మీ ఫ్రెండ్స్‌కు వెళ్తున్నాయా? మీరు రిప్లై ఇవ్వకుండానే చాట్‌లలో సరే , ఓకే లాంటి అతీంద్రియ సమాధానాలు కనిపిస్తున్నాయా? అయితే మీ వాట్సాప్ వెబ్ సెషన్‌ను ఎవరో దత్తత తీసుకున్నారని అర్థం. వెంటనే ఫోన్‌లోని వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లింక్డ్ డివైస్ తనిఖీ చేసి మీకు తెలియని పరికరాలను అక్కడి నుంచి తరిమేయండి.

పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు కాపాడుకోవడంతో పాటు లాగిన్ అయిన డివైజ్‌లపై కూడా ఓ కన్నేసి ఉంచడం ఇప్పుడు తప్పనిసరి. లేదంటే మన సీక్రెట్స్ మనకంటే ముందే ఊరంతా తెలిసిపోయే రోజు ఎంతో దూరంలో లేదు..

Tags:    
  • whatsapp 
  • whatsappweb 
  • cybersecurity 
  • cybersafety 
  • onlinesecurity 

Similar News

వంగవీటి రాధాక్రిష్ణన్...ఈ కొత్త పేరేంటి ?

2026-11-24 01:03 GMT

ఇంట్లోనే ప్రత్యర్ధులు...జగన్ కి 2029 పెను సవాల్ గా ?

2026-11-24 00:55 GMT

అసహనం...ఆగ్రహం...బీజేపీలో ఏమి జరుగుతోంది ?

2026-11-24 00:53 GMT

బీజేపీ పాల‌న‌.. ఏకంగా రాష్ట్రం పేరు మార్చేశారు.. రీజ‌న్‌ తెలిస్తే.. అవాక్కే!

2026-11-24 00:50 GMT

ప్రపంచానికి బట్టలు కుట్టించి.. తన పరువు మాత్రం బజారున పడేసుకున్న బంగ్లాదేశ్

2026-11-24 00:36 GMT

ధ్రువ్ రాఠీకి గట్టి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

2026-11-24 00:28 GMT

పవన్ చెప్పారు... కార్యకర్త డిప్యూటీ మేయర్ అయ్యారు !

2026-11-24 00:28 GMT

అతి 'మౌనం' మంచిదేనా మాధ‌వా.. ?

2026-11-24 00:27 GMT

ఏపీపై కేంద్రం నిఘా : వైసీపీ ప్ర‌చారంలో నిజ‌మెంత‌.. ?

2026-11-24 00:25 GMT

జన‌సేన‌కు స్వేచ్ఛ‌.. కూట‌మిలో ఫుల్ జోష్‌... !

2026-11-24 00:25 GMT

గుడ్ డెసిష‌న్‌: రాధాలో ఈ మార్పు గ‌మ‌నించారా..!

2026-11-24 00:23 GMT

Copyright @2026

Powered by Blink CMS